హీరో మిథున్ చెత్తలో దొరికిన అమ్మాయిని దత్తత తీసుకున్నాడు.. ఆ చిన్న అమ్మాయి నేడు హాలీవుడ్ హీరోయిన్.. ఆమె ఎవరు..

మిథున్ చక్రవర్తి, యోగితా బాలి దంపతులకు ముగ్గురు కుమారులు మహాక్షయ్, ఉష్మే , నమాషి కాకుండా, ఈ శక్తి జంటకు దిశాని చక్రవర్తి అనే అందమైన కుమార్తె ఉంది.


ఆమె తండ్రిలాగే ఆమెకు కూడా నటనపై మక్కువతో నటననే తన కెరీర్‌గా చేసుకుంది. అయితే అసలు ఈ దంపతులకు దిశాని మిథున్ కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా.. ఈ దంపతులకు దిశానీ దత్తపుత్రిక. ఈ విషయం చాలా మందికి తెలియదు. చెత్త డబ్బాలో దొరికిన మిథున్ చక్రవర్తి దత్తపుత్రిక దిశాని ఎవరంటే..

దిశాని కోల్‌కతాలో జన్మించింది. ఆమె పుట్టిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెను ఒక చెత్త డబ్బా దగ్గర విడిచిపెట్టారు. ఆ సమయంలో ఈ విషయాన్నీ ఒక బెంగాలీ వార్తాపత్రికలో ఒక నవజాత శిశువును ఆమె కుటుంబం చెత్త కుప్పలో వదిలివేసినట్లు ప్రచురించింది. చెత్త డబ్బా దగ్గర ఉన్న చిన్నారిని కొంతమంది బాటసారులు గమనించారు. వారిలో ఒకరు చిన్నారిని తమ ఇంటికి తీసుకెళ్లారంటూ మరుసటి రోజు వార్తని ప్రచురించగా.. ఈ వార్తని చదివిన ఆ పాపని తాను దత్తత తీసుకోవాలనుకున్నాడు మిథున్. ఈ విషయంపై తన భార్య యోగితా బాలితో మాట్లాడి.. వెంటనే ఆ బిడ్డను దత్తత తీసుకోవాలనే కోరికను రక్షకులకు తెలియజేశాడు. ఆ తరువాత గవర్నమెంట్ రూల్ ప్రకారం దత్తత కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు మిధున్ దంపతులు. తన భర్త కోరిక తీరేందుకు యోగితా పూర్తి మద్దతు ఇచ్చింది. మిధున్ దంపతులు తెచ్చుకున్న ఆ చిన్న పిల్ల నేటి ప్రముఖ నటి దిశాని చక్రవర్తి. అప్పటి నుంచి ఆ చిన్నారి మొత్తం కుటుంబానికి ప్రియమైన వ్యక్తిగా మారింది. మిథున్ కు తన కుమార్తె అంటే చాలా ఇష్టం.

దిశాని తన ప్రాథమిక విద్యను భారతదేశంలో పూర్తి చేసి.. ఉన్నత చదువుల కోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు వెళ్లింది. ఆమె న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి యాక్టింగ్ లో డిగ్రీ పట్టా పొందింది. మీడియా నివేదికల ప్రకారం ఈ స్టార్ కిడ్ చిన్నప్పటి నుంచీ నటనను ఇష్టపడేది. ఆమెకు ఇష్టమైన హీరో సల్మాన్ ఖాన్.

దిశాని చక్రవర్తి హాలీవుడ్ చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది.
ఆమె 2017లో విడుదలైన తన లఘు చిత్రం ‘గిఫ్ట్’తో హాలీవుడ్‌లో తొలిసారిగా నటించింది. ఆమె ఇతర ప్రాజెక్టులు ‘హోలీ స్మోక్’, ‘అండర్‌పాస్’, ‘వై డిడ్ యు డూ ఇట్’ , ‘టూ ఫేస్డ్’. దిషాని చివరిసారిగా 2022లో ‘ది గెస్ట్’ అనే లఘు చిత్రంలో కనిపించింది. ఇందులో దిశానీ తన నటనకు చాలా ప్రశంసలు అందుకుంది.

బాలీవుడ్ లో తన కాలంలో మిథున్ చక్రవర్తి గొప్ప నటులలో ఒకరు. అప్పట్లో మిథున్ చక్రవర్తిని ‘డిస్కో కింగ్’ అని ప్రశంసించేవారు. మూడు జాతీయ అవార్డులు అందుకున్న మిథున్.. ఐదు దశాబ్దాల పాటు తన కెరీర్‌లో 350 కి పైగా లు చేశారు. 1976లో ‘మృగయా’ చిత్రంతో మిథున్ బాలీవుడ్ లో వెండి తెరపై అడుగు పెట్టి తన నట జీవితాన్ని ప్రారంభించాడు. 1982లో డిస్కో డాన్సర్ చిత్రంతో మిథున్ చక్రవర్తి సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి ఆయన సినీ పరిశ్రమలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మిథున్ చక్రవర్తి హీరోగా మాత్రమే కాదు.. వివిధ పాత్రల్లో తనదైన శైలిలో నటించి అభిమానులను మెప్పించాడు. అగ్నిపథ్, ప్యార్ ఝుక్తా నహిన్, బాజీ, వీర్, డ్యాన్స్ డ్యాన్స్, గోల్మాల్ 3, ది కాశ్మీర్ ఫైల్స్ సహా అనేక ఇతర చిత్రాలలో నటుడిగా తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకున్నాడు.

మిథున్ వృత్తి జీవితం వలె.. మిథున్ వ్యక్తిగత జీవితం కూడా చాలా దృష్టిని ఆకర్షించింది. మిథున్ మొదట నటి మోడల్ హెలెనా ల్యూక్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే వీరు పెళ్లి చేసుకున్న నాలుగు నెలల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత మిథున్ 1979లో నటి యోగితా బాలిని వివాహం చేసుకున్నాడు. మిథున్ చక్రవర్తి, యోగితలకు మహాక్షయ్, నమాషి, ఉష్మే , దిశాని చక్రవర్తి అనే నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే దిశాని తండ్రి బాటలో నడుస్తూ నటిగా వెండి తెరపై అడుగు పెట్టింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.