ఆ టీచర్‌ పాఠాలు చెప్పే తీరే వెరేలెవెల్‌..! ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే

చూస్తుండగానే వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్లు మొదలయ్యాయి. ఇక పిల్లలు, పెద్దలు హడావిడి మాములుగా ఉండదు. ఇన్నాళ్లు జాలీగా గడిపిన చిన్నారులకు ఇప్పుడు స్కూల్‌కి వెళ్లాంటే ఉంటుంది బాధ..మాములుగా ఉండదు.


వాళ్లని యథావిధిగా స్కూల్‌కి వెళ్లేలా చేయలేక పేరెంట్స్‌ తంటాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. సరిగ్గా ఈ సమయంలో సామాజిక మాధ్యమంలో ఓ టీచర్‌ పిల్లలను ఆకట్టుకునేలా పాఠాలు చెబుతున్న వైరల్‌ వీడియో అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇలా ప్రతి టీచర్‌ పిల్లల్నిఎంజాయ్‌ చేసేలా పాఠాలు చెబితే వాళ్లు స్కూల్‌కి వెళ్లనని మారం చెయ్యరు అంటున్నారు నెటిజన్లంతా. మరీ ఆ వీడియో కథాకమామీషు ఏంటో చూద్దామా..!.

వేసవి సెలవుల తర్వాత స్కూల్స్‌ తెరిచిన రోజు సామాజిక మాధ్యమాల్లో ఒక టీచర్‌ వీడియో వైరల్‌ అయింది. తొలి రోజు తరగతి గదిలో నృత్యం చేస్తూ, పాట పాడుతూ చిన్నారులను హుషారు పరచడం ఆ వీడియో సారాంశం. ఆ టీచర్‌ పేరు వందనరాయ్‌. కర్నాటకలోని కర్కలకు చెందిన వందన పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠం చెప్పడంలో దిట్ట. కన్నడ, ఆంగ్ల అక్షరాలను నృత్యం చేస్తూ పిల్లలకు ఆమె నేర్పే తీరు ఆకట్టుకుంటోంది.

పండ్లు, కూరగాయలను పరిచయం చేస్తూ వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆడుతూ, పాడుతూ చెబుతారు. ప్రత్యేక సందర్భాల్లో పిల్లలకు సందర్భోచితంగా మేకప్‌ వేసి పాటలు నేర్పుతూ ఆటలాడిస్తారు. ఆమె వీడియోలు యూట్యూబ్‌లో వైరల్‌ అయ్యాయి. బోధనకు, సృజనాత్మకత తోడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియోలు చెప్పకనే చెబుతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.