ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ

కర్నూలు రోడ్డు ప్రమాదం తరహాలో.. మరో ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ పూర్తి కాలిపోయాయి. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న AR BCVR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..
నంద్యాల జిల్లా.. సిరివెల్లమెట్టు దగ్గర్లో ప్రమాదంలో చిక్కుకుంది. బస్సు టైరు పేలడంతో.. బస్సు అదుపు తప్పింది. డివైడర్ దాటి.. రోడ్డుకి అటువైపుగా వస్తున్న ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీన్, బస్సు డ్రైవర్ మృతి చెందారు. బస్సుకి మంటలు అంటుకొని.. కాలిపోయింది. లారీ కూడా మంటల్లో చిక్కుకొని కాలిపోయింది.


ఈ ఘటనలో బస్సు క్లీనర్‌ని మెచ్చుకోవాలి. అతను ప్రమాదం జరిగిన వెంటనే.. ప్రయాణికుల్ని అప్రమత్తం చేశాడు. ఎలాగొలా దిగిపోవాలని సూచించాడు. దాంతో ప్రయాణికులు.. బస్సు అద్దాల్ని పగలగొట్టి.. బయటకు దూకేశారు. అదే సమయంలో.. ఈ ఘోర ప్రమాద శబ్దం విని.. స్థానికులు పరుగున వచ్చారు. బస్సులో ఉన్న ప్రయాణికుల్ని ఒక్కొక్కర్నీ బయటకు సురక్షితంగా లాగేశారు. అటు క్లీనర్ కూడా.. సహకరించాడు. ఇలా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

బస్సు, లారీ పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వచ్చారు. సహాయక చర్యల్లో వారు కూడా పాలుపంచుకున్నారు. ఇలా ఈ ప్రమాదం సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినట్లైంది. ఇదివరకు కర్నూలులో ఇలాగే బస్సుకి మంటలు అంటుకొని 19 మంది చనిపోయారు. అలా ఇక్కడ జరగకుండా.. అలర్ట్‌నెస్ వల్ల అందరూ ప్రాణాలు దక్కించుకున్నారు.

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్, బస్సు డ్రైవర్‌లు ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రయాణికులు తెలివిగా వ్యవహరించి, బస్సు అద్దాలు పగలగొట్టి ప్రాణాలతో బయటపడటం గొప్ప విషయం. వారు.. అద్దాలు పగలగొట్టాలా వద్దా అని ఆలోచిస్తూ.. సందేహిస్తూ ఉంటే.. మంటల్లో చిక్కుకునేవారే. బస్సు బూడిద కుప్పలా మారింది.

నంద్యాల ఎస్పీ సునీల్ సింగ్ దీనిపై స్పందించారు. “బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. వారెవరికీ గాయాలు కాలేదు” అని చెప్పారు. ప్రమాద స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టైరు పేలడానికి కచ్చితమైన కారణాలు, ఇతర వివరాలు దర్యాప్తులో తెలుస్తాయి అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.