తాజాగా అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన మనవడు అల్లు శిరీష్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు ఈ పోస్ట్ పెట్టడంతోనే చాలామంది నెటిజన్లు తెగ సంబర పడిపోయారు.
ఇక అందులో ఉన్న పోస్ట్ ఏంటి అంటే తాను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఫొటోస్ షేర్ చేసుకున్నారు.అంతే కాకుండా నైనికతో నాకు ఎంగేజ్మెంట్ జరిగిందని కూడా క్లారిటీ ఇచ్చారు.
అలా ఎంగేజ్మెంట్ రింగుతో ఉన్న తన ప్రియురాలు చేతును పట్టుకొని దిగిన పిక్ ని కూడా షేర్ చేసుకున్నారు.దీంతో చాలామంది అల్లు అభిమానులు అల్లు శిరీష్ పెళ్లి జరగబోతుందని తెగ సంబరపడిపోయారు. కానీ అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై చాలా మంది మండిపడుతున్నారు
అయితే దానికి కారణం రీసెంట్ గానే అల్లు కనకరత్నమ్మ మరణించింది కాబట్టి కనీసం రెండు మూడు నెలలు కూడా దాటకుండా శుభకార్యం చేసుకోవడం ఏంటి అని చాలామంది విమర్శిస్తారు
దీంతో సోషల్ మీడియాలో కామెంట్ల మోత మోగిస్తున్నారు.కనీసం నానమ్మ చనిపోయి ఆరు నెలలు కూడా దాటక ముందే శుభకార్యం చేసుకోవడం ఏంటి..
ఎవరైనా చనిపోతే ఆడవాళ్లకు పెళ్లి చేస్తే శుభకార్యం అంటారు. కానీ మగవాళ్లకు పెళ్లి ఎలా చేస్తారు అంటూ మండిపడుతున్నారు. హిందువులై ఉండి కనీసం వీటిని కూడా పాటించరా అంటూ అల్లు ఫ్యామిలీ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే సెలబ్రిటీలు వీటన్నింటినీ పట్టించుకోరు అని మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు

































