సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యం.. శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరికి తగినంత నిద్ర అవసరం. నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పెద్దలకు, సాధారణంగా రాత్రికి 7-9 గంటల నిద్ర అవసరం. పిల్లలు, టీనేజర్లకు ఎక్కువ గంటలు నిద్ర అవసరం ఉంటుంది.
సమయానికి నిద్ర లేవకపోతే, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. నిద్రలేమి వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, జ్ఞాపకశక్తి మందగించడం, ఏకాగ్రత తగ్గడం, మానసిక స్థితిలో మార్పులు, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
నిద్రలేమి ప్రభావాలు…
శారీరక ఆరోగ్యం: నిద్రలేమి వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. రక్తపోటు పెరగడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
మానసిక ఆరోగ్యం: నిద్రలేమి వల్ల ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి మందగించడం, మానసిక స్థితిలో మార్పులు, చిరాకు, నిరాశ వంటి సమస్యలు వస్తాయి.
జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత: నిద్రలేమి వల్ల మెదడు సరిగా పనిచేయదు. దీనివల్ల నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. ఏకాగ్రత తగ్గడం వల్ల పనులు సరిగ్గా చేయలేరు.
డ్రైవింగ్ పనితీరు: నిద్రలేమి ఉన్నప్పుడు వాహనాలు నడపడం ప్రమాదకరం. అలాగే పని చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది.
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు: దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిద్రలేమిని నివారించడానికి, ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రపోయే ముందు కెఫిన్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండడం, ధ్యానం లేదా యోగా చేయడం వంటివి చేయవచ్చు.
అయితే ఒక్క గంట నిద్ర తక్కువైతే రికవరీ కావడానికి ఎన్ని డేస్ పడుతుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్థాయి కంటే ఒక గంట తక్కువగా నిద్రపోతే.. బాడీ ఆ ప్రభావం నుంచి బయటపడేందుకు కనీసం నాలుగు రోజులు పడుతుందని హెల్త్ ఎక్స్ఫర్ట్స్ చెబుతున్నారు. కేవలం ఒక గంట లోటు కూడా తలనొప్పి.. ఏకాగ్రత లోపం, చికాకుతో పాటు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తాయని తెలిపారు. దీంతో పాటు రోజంతా ఆవలింతలు వచ్చి.. చిరాకుగా అనిపిస్తుందని వెల్లడించారు. కాగా పెద్దలు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
































