ప్రతిరోజు ఎన్ని కోడిగుడ్లు తినొచ్చు? తింటే అనర్థమా?

గుడ్డు వెరీ గుడ్డు.. అంటారు. ప్రతిరోజు తినే ఆహారంలో గుడ్డు ఉండడం వల్ల ఎంతో మంచిదని చెబుతూ ఉంటారు. ఇదే పిల్లలు అయితే ప్రతిరోజు కచ్చితంగా ఒక కోడి గుడ్డు తినాలని అంటారు. అయితే వాస్తవానికి యువకులు, వర్కౌట్ చేసేవారు కూడా ఎగ్ తినాలని చెబుతూ ఉంటారు. కొందరు అదే పనిగా ఇష్టం వచ్చినట్లు బాయిల్డ్ ఎగ్ తింటూ ఉంటారు. మరికొందరు ఆమ్లెట్ రూపంలో ఎగ్ తీసుకుంటూ ఉంటారు. ఎగ్ తినడం వల్ల ఎంతో ఆరోగ్యమని ఈ రకంగా చేస్తారు. కానీ వాస్తవానికి పరిమితికి మించి గుడ్లు తినడం వల్ల అనారోగ్యాన బారిన పడే అవకాశం ఉంది. మరి ప్రతిరోజు ఎన్ని కోడిగుడ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు?


ప్రతిరోజు గుడ్డు తినడం మంచిదే. కానీ ఇది పరిమితి ఉండాలి. ప్రతిరోజు యువకులు, వర్కౌట్ చేసేవారు రెండు కోడిగుడ్లు తినడం ఆరోగ్యం అని నిపుణులు తెలుపుతున్నారు. అందులోనూ గుడ్డులో ఉండే తెల్లని భాగం ప్రోటీన్ తో కలిగి ఉంటుంది. ఎల్లో పార్ట్ కొవ్వును కలిగి ఉంటుంది. కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం తెల్లని భాగం మాత్రమే తినాలని అంటుంటారు. పచ్చ సోనా ఎక్కువగా తీసుకోవద్దని అంటారు. వాస్తవానికి వర్గం చేసేవారు గుడ్డు మొత్తం తింటేనే ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. అయితే తెల్ల భాగం, పచ్చ సోనా అని కాకుండా గుడ్డు మొత్తం తినడం వల్ల ఆరోగ్యంగానే ఉంటారు. అయితే ఇవి ప్రతి రోజుకు రెండు మాత్రమే ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

గుడ్డును బాయిల్డ్ చేసి తీసుకోవడం వల్ల మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు. ఆమ్లెట్ రూపంలో తీసుకుంటే ఎక్కువగా ఆయిల్ వెళ్లి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారానికి ఒకసారి లేదా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆమ్లెట్ తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు గుడ్డు తినాలనుకునే వారు మాత్రం బాయిల్డ్ ఎగ్ తీసుకోవడమే మంచిది.

ఇక కూల్ డ్రింక్ తీసుకునేవారు కూడా చాలా వరకు అనారోగ్యానికి గురవుతున్నారు. కూల్ డ్రింక్ లో ఎక్కువ శాతం షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇటీవల చాలామంది డయాబెటిక్ వ్యాధికి గురయ్యే వారు ఎక్కువగా షుగర్ కంటెంట్ తీసుకోవడమే. అందువల్ల ఎప్పుడో ఒకసారి లేదా.. వారానికి ఒకసారి మాత్రమే కూల్ డ్రింక్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ప్రతిరోజు కూల్ డ్రింక్ తీసుకోవడం వల్ల షుగర్ శరీరంలోకి ఎక్కువగా వెళ్లి తొందరగా షుగర్ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందులోనూ వాతావరణం చల్లగా ఉన్న సమయంలో కూల్ డ్రింక్ తీసుకోవడం వల్ల తొందరగా అనారోగ్యానికి గురై అవకాశముంది. కూల్ డ్రింక్ బదులు సాంప్రదాయ ద్రవాలను తీసుకోవడం మంచిది. నిమ్మరసం లేదా కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వీటితోపాటు రోస్టెడ్ ఫుడ్.. స్ట్రీట్ ఫుడ్ వంటి వాటికీ కూడా దూరంగా ఉండాలి. ఇటువంటి ఆహారంలో ఉప్పు ఎక్కువగా కలిగి ఉండి బ్లడ్ ప్రెషర్ ను పెంచుతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.