బైక్‌ మైలేజ్​ ఇవ్వడం లేదా? వారానికి ఒకసారి ఇలా చేయండి – స్పీడ్‌, మైలేజ్​ రెండు పెరుగుతాయి!

బైక్‌ మైలేజ్​ ఇవ్వడం లేదా? వారానికి ఒకసారి ఇలా చేయండి – స్పీడ్‌, మైలేజ్​ రెండు పెరుగుతాయి!

How to Improve Bike Mileage: మీకు బైక్​ ఉందా..? అది మంచి మైలేజ్​ ఇవ్వడం లేదని వాపోతున్నారా..? నో టెన్షన్​. ఈ చిన్న టిప్స్​ పాటిస్తే.. మంచి మైలేజ్​తో పాటు సూపర్​ స్పీడ్​ కూడా గ్యారెంటీ..!
How to Improve Bike Mileage with Simple Tips: బైక్ కొన్న కొత్తలో బాగానే ఉంటుంది. కానీ.. కొన్నాళ్ల తర్వాత మైలేజ్ సమస్య మొదలవుతుంది. లీటరుకు కనీసం 40 కిలోమీటర్లు కూడా రావడం లేదని చాలా మంది వాపోతుంటారు. మరి.. ఈ మైలేజ్​ సమస్యను అరికట్టడమెలా? మైలేజ్​ పెంచేందుకు ఏం చేయాలి? ఏమైనా పరిష్కార మార్గాలున్నాయా? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

How to Clean Bike Chain in Telugu: చాలా మంది బైక్​ను ఇష్టం వచ్చినట్లు నడుపుతుంటారు. బైక్​ క్లీనింగ్ విషయంలో కూడా శ్రద్ధ చూపించరు. అవసరం ఉన్నప్పుడు వాడి.. తర్వాత పక్కన పెడతారు. దీనివల్ల మైలేజ్ సమస్య వస్తుంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడి.. బండి పర్ఫెక్ట్​ మైలేజ్​ ఇవ్వాలంటే బైక్​ను జాగ్రత్తగా చూసుకోవడంతోపాటు.. బైక్​ చైన్​ను వారానికి ఒకసారి క్లీన్​ చేయాలని ఆటోమొబైల్​ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల బండి మంచి మైలేజ్​ ఇవ్వడంతోపాటు ఇంధనం అవసరం కూడా తగ్గుతుందని అంటున్నారు.
బైక్‌ చైన్‌ ఎలా క్లీన్‌ చేయాలంటే..?

Related News

ఇంట్లో బైక్ చైన్‌ను శుభ్రం చేయడానికి ముందుగా బ్రష్, చైన్ క్లీనింగ్ సొల్యూషన్, క్లాత్, చైన్ ఆయిల్ సిద్ధం చేసుకోవాలి.
తర్వాత బైక్​ను డబుల్ స్టాండ్ మీద నిలబెట్టాలి.
శుభ్రపరిచే ముందు చైన్​ను చెక్​ చేయాలి.
చైన్ వదులుగా ఉందా? లింక్‌లు గట్టిగా ఉన్నాయా? తుప్పు పట్టిందా? అనేది చూడాలి.
వీటన్నింటినీ తనిఖీ చేసిన తర్వాత.. చైన్ క్లీనర్ ఉపయోగించి బ్రష్‌తో రుద్దాలి.
చైన్​ ఒక వైపు మాత్రమే కాకుండా రెండు వైపులా శుభ్రం చేయాలి.
సరిగ్గా క్లీన్​ చేసిన తర్వాత లైట్ ప్రెజర్ వాటర్ పైపుతో లేదా బకెట్‌లో నీటిని తీసుకొని చైన్​ను సరిగ్గా శుభ్రం చేసిన తర్వాత శుభ్రమైన క్లాత్​తో పూర్తిగా తుడవండి.
చైన్​ పూర్తిగా ఆరిపోయాక దానిపై నాణ్యమైన లూబ్రికెంట్ ఆయిల్​ను అప్లై చేయండి.
టైర్​ను నెమ్మదిగా తిప్పుతూ అప్లై చేయడం వల్ల మొత్తం చైన్​కు ఆయిల్​ పడుతుంది.
లూబ్రికెంట్ అప్లై చేసిన తర్వాత కొంత సేపు అలాగే వదిలేయాలి.
దీనివల్ల టైర్స్​ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా తిరుగుతాయి. బైక్‌ స్పీడ్‌, మైలేజీ రెండు పెరుగుతాయి.

అయితే బైక్​ను ఇంట్లో క్లీన్​ చేసుకోలేని వారు సర్వీసింగ్​కు ఇస్తుంటారు. బండి సర్వీసింగ్​ చేయించే సమయంలో కొన్ని విషయాలు గమనించుకోవాలి. ఎందుకంటే.. బండిని సర్వీసింగ్​కు ఇచ్చినప్పుడు చాలా మంది మెకానిక్​లు చేసే తప్పు.. బైక్‌ సర్వీసింగ్‌ అయిపోయిన వెంటనే గొలుసుపై ఆయిల్‌ వేయడం. ఇది చాలా తప్పు. చైన్‌ నుంచి నీరు పూర్తిగా తొలగించిన తర్వాత క్లాత్​ పెట్టి తుడిచిన తర్వాత.. తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే దానిపై ఆయిల్‌ వేయాలి. దీంతో బైక్‌ స్పీడ్‌, మైలేజ్​ రెండు పెరుగుతాయి.

Related News