ఎలా ఆడేది గురూ నువ్వు ఇలా బాల్ వేస్తే.. బుమ్రా బౌలింగ్ తో బెన్ స్టోక్స్ కు దిమ్మదిరిగిపోయింది.. వీడియో !

Jasprit Bumrah – Ben Stokes: వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా తన స్వింగ్ బౌలింగ్, యార్కర్లతో విరుచుకుపడుతూ ఇంగ్లాండ్ బ్యాటర్స్ ను ఒక ఆటాడుకున్నాడు.
ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్లు సైతం బుమ్రా బౌలింగ్ ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక పెవిలియన్ కు క్యూకట్టారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో భారీగా పరుగులు చేయకుండా అడ్డుకున్న బుమ్రా 6 కీలకమైన వికెట్లు తీసుకుని ఇంగ్లాండ్ దెబ్బకొట్టాడు. అయితే, ఈ మ్యాచ్ లో బుమ్రా వేసిన బౌలింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే బుమ్రా బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ వికెట్లు ఎగిరిపడ్డాయి.


టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్.. యార్కర్లలో ఇంగ్లాండ్ పై విరుచుకుపడ్డాడు. కీలకమైన ఆరు వికెట్లు తీసుకోగా, అద్భుతమైన యార్కర్ తో ఒల్లీ పోప్ ఔట్ కాగా, రెండు వికెట్లు ఎగిరిపడ్డాయి. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ ను ఔట్ చేసిన స్వింగ్ బాల్ అయితే, మరో లెవల్ బౌలింగ్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో బుమ్రా వేసిన ఒక అద్భుతమైన బాల్ కు క్లీన్ బౌల్డ్ అయిన బెన్ స్టోక్స్ కు ఇచ్చిన రియాక్షన్ చూడాలి ! అతనికి ఎంతలా దిమ్మదిరిగి పోయిందో.. ! ఔట్ అయిన తర్వాత ఎలా ఆడాలి గురూ అంటూ బుమ్రా కేసి చూస్తూ రియాక్షన్ ఇచ్చాడు.. ! ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెన్ స్టోక్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బౌలింగ్ చేసిన బుమ్రా ఇంగ్లాండ్ బ్యాటర్స్ కు చెమలు పట్టించే బౌలింగ్ వేశాడు. ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ ను ఔట్ చేసిన అద్భుతమైన బాల్ బ్యాటర్ నుంచి ఔట్ స్వింగ్ కావాల్సింది కానీ, బుమ్రా తన రివర్స్ స్వింగ్ నైపుణ్యంతో స్టోక్స్ ను దెబ్బకొట్టాడు. ఆ బాల్ వికెట్లు తాకగానే బెన్ స్టోక్స్ ఈ బంతిని ఎలా ఆడాలి అంటూ బ్యాట్ ను కిందపడేసి ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మీరు చూసేయండి మరి.. !

https://twitter.com/Cr7Vk18_10/status/1753731684502216838?t=nQ34Bty7YtuIaao1CSxTjg&s=19

కాగా, ఈ మ్యాచ్ లో 6 వికెట్లు తీయడం ద్వారా జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్ లిస్టులో చేరాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా (34 మ్యాచ్ లలో) 150 వికెట్లు తీసిన పేసర్ గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా (స్పిన్, పెస్ బౌలింగ్) అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ (29 మ్యాచ్ లు), జడేజా (32 మ్యాచ్ లు) బుమ్రాకంటే ముందున్నారు. అయితే, అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన తొలి ఐదుగురు బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడు మాత్రమే పేసర్ కావడం విశేషం.