Yamaha RX 100: మార్కెట్లోకి RX 100 సరికొత్త మోడల్.. ఇక యూత్‌కి పండగే.. లాంచ్ ఎప్పుడంటే..?

Yamaha RX 100: యమహా తన అత్యంత ప్రజాదరణ పొందిన RX 100 ని మళ్లీ మార్కెట్లోకి తీసుకురావాలని చాలా కాలంగా చూస్తోంది. తరాలు ఎన్ని మారినా, కొత్త కొత్త ట్రెండ్స్ ఎన్ని వచ్చినా కొన్ని పాత వాటికి ఉండే పాపులారిటీ ఎన్నటికీ తగ్గదు. మోటార్ సైకిళ్ల విషయానికి వస్తే యమహా RX100 బైక్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. 1990s లో ఈ బైక్ యువతను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. నేటికీ ఈ బైక్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ బైక్ నుంచి వచ్చే సౌండ్, దీని స్పోర్టీ లుక్, ఈ బైక్ డిజైన్ అంటే చాలా మందికి ఇష్టం.

అయితే ఈ బైక్ మంచి రన్నింగ్ లో ఉన్న టైంలో అనుకోకుండా ప్రొడక్షన్ ని స్టాప్ చేశారు. కానీ, మళ్లీ RX100 బైక్ కమ్ బ్యాక్ ఇవ్వబోతుంది. మరి ఈ కొత్త బైక్ ఎలా ఉండబోతుందో.. దానికి సంబంధించిన ఆ వివరాలు ఏంటో.. ఇప్పుడు చూద్దాం. యూత్ ఐకానిక్ బైక్ యమహా RX 100 తిరిగి మార్కేట్ లోకి రాబోతుంది. ఇండియా మార్కెట్‌లో వినియోగదారులకు పరిచయం అక్కర్లేని పేరు యమహా RX 100 (Yamaha RX 100) బైక్‌. ఎందుకంటే ఈ మోడల్‌ మన దేశంలో జపనీస్ టూ-వీలర్ తయారీదారు యమహాకు బలమైన పునాది వేసింది.
నేటికీ యమహా RX 100 (Yamaha RX 100) బైక్‌ అంటే యూత్ లో సూపర్ క్రేజ్‌ ఉంది. సౌండ్ ద్వారా మార్కెట్లో కొత్త సంచలనం సృష్టించిన ఈ యమహా కంపెనీ RX 100.. యూత్ ఫేవరెట్ బైక్‌గా నిలిచింది. ఒకప్పుడు కుర్రకారును ఓరేంజ్ లో ఉర్రూతలూగించిన ఈ బైక్‌కు ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. 2003 వరకు విక్రయాల్లో దూకుడు చూపించిన ఈ బైక్ ఉత్పత్తి అప్పటి నుంచి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో RX 100 అభిమానులకు యమహా సంస్థ ఒక గుడ్ న్యూస్ అదే విధంగా ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. మొదటగా బ్యాడ్‌ న్యూస్‌ ఏంటంటే..

యమహా ‘RX100’ బైక్‌ ఇక ఇండియాలో ఎక్కడా కనపడదు. గుడ్‌ న్యూస్‌ ఏంటంటే.. యమహా కంపెనీ ‘RX’ పేరుతో న్యూ బైక్‌ని అభివృద్ధి చేస్తోంది. ‘యమహా RX 100’ పేరుకు ఉన్న భావోద్వేగ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని.. అదే పేరుతో ఆధునిక ఫోర్-స్ట్రోక్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. యమహా RX100 1990sలో భారతీయ రోడ్లపై ఆధిపత్యం చెలాయించినటువంటి అసలైన టూ-స్ట్రోక్ వెహికల్‌. అప్పట్లో RX100 లెక్కలేనన్ని జ్ఞాపకాలను మూటగట్టుకుంది.
ఇండియాలో యమహా చరిత్రలో RX100 ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందనడంలో ఆశ్చర్యం లేదు. రెండు-స్ట్రోక్ మోటార్‌సైకిళ్లు గతానికి సంబంధించినవి కాబట్టి, ఆధునిక 100cc ఫోర్-స్ట్రోక్ మోటార్‌సైకిల్ RX100 (Yamaha RX 100) పేరుకి సరైనన్యాయం చేయకపోవచ్చు. ఈ విషయాన్ని యమహా మోటార్ ఇండియా ప్రెసిడెంట్ ఐషిన్ చిహానా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యమహా మోటార్ ఇండియా ప్రెసిడెంట్ ఐషిన్ చిహానా ఏమన్నారంటే.. RX100 అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక అద్భుతమైన చరిత్రను కలిగి ఉందన్నారు.

Related News

ఇండియాలో RX 100 పేరుకు ఉన్న ఉత్సాహం చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆటోమోటివ్ ప్రపంచంలో ఐకానిక్ పేరును పునరుద్ధరించడం తయారీదారులకు ఎల్లప్పుడూ సవాలుగా ఉంటుందన్నారు. యమహా ఫార్ములాని పూర్తి చేసేవరకు RX100 పనితీరు స్థాయిలకి సరిపోయే అధిక పనితీరు గల తేలికపాటి మోటార్‌సైకిల్‌ని రిలీజ్ చేయదని చిహానా ధ్రువీకరించారు. YZF-R15, MT-15లో ఉపయోగించిన ప్రస్తుత 155cc ఇంజిన్.. అలాంటి మోటార్‌సైకిల్‌ని రూపొందించడానికి సరిపోదన్నారు.
RX మోనికర్‌తో మోటార్‌సైకిల్ కనీసం 200cc ఇంజిన్ సైజుని కలిగి ఉండాలని యమహా అభిప్రాయపడడం జరిగింది. అయినప్పటికీ, ఆధునిక ఇంజిన్‌తో కూడా యమహా RX100 యొక్క టూ-స్ట్రోక్ 98cc ఇంజిన్ ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ఐకానిక్ ఎగ్జాస్ట్ సౌండ్‌ని పునరావృతం చేయలేకపోవచ్చని భావిస్తోంది. యమహా RX100 వంటి ఐకానిక్ నేమ్స్ తో చాలామందికి భావోద్వేగాలుంటాయి. అందుకే ఆపేరుతో కొత్తబైక్‌ని రిలీజ్ చేయడం సవాల్‌గా మారింది. యమహా RX100 బైక్ విషయానికివస్తే, ఇది 1996 వరకు ఇండియాలో ఉత్పత్తి చేయబడింది.

కానీ యమహా RX100 1985 నుంచి 1987 వరకు CKD యూనిట్‌గా ఇండియాలో అందుబాటులో ఉంది. యమహా RX100 (Yamaha RX 100) బైక్‌లో 98.2సీసీ, టూ-స్ట్రోక్ ఇంజిన్ కలిగి ఉన్నాయి. ఈ ఇంజిన్ 11 బీహెచ్‌పీ పవర్ వద్ద 10.45 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తోంది. 1996 తర్వాత, భారతదేశంలో ఉద్గార చట్టాలు అలాగే నిబంధనలను అధిగమించడానికి యమహా RX100ని యమహా RXGతో భర్తీ చేసింది. 1997లో, యమహా RXZని ప్రారంభించింది. ఐతే ఈ మోడల్‌కి పూర్తిగా భిన్నమైన చట్రం తక్కువ వీల్‌బేస్‌తో ఉంది. ఈ మోడల్ 12 bhp వద్ద కొంచెం ఎక్కువ పవర్ ని ఉత్పత్తి చేసింది
ఇతర ఛేంజస్ చేయడంతో కొద్దిగా స్పోర్టియర్ మొత్తం డిజైన్‌తో విభిన్నమైన బాడీని కలిగి ఉంది. చివరిగా ‘RX100’ పేరుతో ఉన్న సెంటిమెంట్ విలువను కాపాడటానికి దానిని పునరుద్ధరించలేకపోయినా, యమహా ‘RX’ పేరుతో 200cc కంటే పెద్ద పని తీరు – ఆధారిత ఇంజిన్‌ను కలిగి ఉన్న మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఇకపోతే తెలిసిన వార్తల ప్రకారం, ఇది 2025 లేదా 2026 నాటికి మన ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అవ్వొచ్చు.

యమహా RX100 (Yamaha RX 100) లో ఈసారి మీరు బైక్‌లో రౌండ్ హెడ్ లైట్ ఫ్లాట్ సీట్లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ వంటి ప్రత్యేక ఫీచర్లను చూడొచ్చు. ఇది 150సీసీ ఇంజన్‌లో కూడా లభ్యం కానున్న సంగతి తెలిసిందే. 110 కి.మీ గరిష్ట వేగంతో పరిగెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ బైక్ 45 కి.మీ మైలేజీని కూడా ఇవ్వగలదని అంచనా వేయబడింది. ఇప్పటివరకు ధర గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. ఇక యమహా ఈ మోటార్‌సైకిల్ రిలీజ్ కి సంబంధించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ని ధ్రువీకరించలేదు.

Related News