అమెజాన్‌లో ”Great Indian Festival Sale 2025” జోరుగా సాగుతోంది. ఈ సేల్ సమయంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన అవకాశం. ఇందులో OnePlus 13R 5G పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
ఈ-కామర్స్ సైట్ ఈ OnePlus ఫోన్‌పై భారీ ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. OnePlus 13R పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్లు, ఆఫర్ల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
OnePlus 13R 5G Price
OnePlus 13R 5Gలోని 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.37,999 కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి చేసే చెల్లింపులపై రూ.2,000 వరకు తగ్గింపు ఉంటుంది. ఈ తగ్గింపు తర్వాత OnePlus 13R 5G ఫోన్ రూ.35,999 కు వస్తుంది. దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.36,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.
అయితే ఈ ఆఫర్ మొత్తం పొందాలంటే పాత ఫోన్ మెరుగైన స్థితిలో ఉండాలి. మోడల్ బట్టి ధరను నిర్ణయిస్తారు. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 2025లో రూ.42,999 కు లాంచ్ అయింది. ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది.
OnePlus 13R 5G Specs
OnePlus 13R 5G ఫచర్ల విషయానికొస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2780×1264 పిక్సెల్స్ రిజల్యూషన్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల ఫుల్ HD+ LTPO డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. OnePlus 13R 5G ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్ OS 15.0పై నడుస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో.. 5G, 4G LTE, డ్యూయల్-సిమ్ (నానో-సిమ్), Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS వంటివి ఉన్నాయి.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. OnePlus 13R 5Gలో వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ లాక్ ఉన్నాయి. OnePlus 13R 5G ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది.
































