తిరుమలలో శ్రీవాణి ట్రస్టుకు భారీగా విరాళాలు

 తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్వహణలోని శ్రీవాణి ట్రస్టుకు (Sri Vani Trust) భక్తులు అత్యధికంగా విరాళాలు ఇస్తున్నారు. శ్రీవాణి ట్రస్టుకు 2300 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందించారు.


ఇప్పటి వరకు అత్యధిక విరాళాలు అందుకున్న ట్రస్టుగా అన్నప్రసాద ట్రస్టు (Anna Prasada Trust) ఉంది. అయితే అన్నప్రసాద ట్రస్టు విరాళాల రికార్డును శ్రీవాణి ట్రస్టు దాటేసింది. శ్రీవాణి ట్రస్టుకు రోజుకి కోటి రూపాయల వరకు విరాళాలు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

తిరుమల శ్రీవాణి ట్రస్ట్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అందించే ఒక పథకం. ఈ ట్రస్ట్‌కు రూ. 10,000 విరాళం ఇచ్చిన భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తుంది. దీని వల్ల తక్కువ సమయంలో దర్శనం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఈ దర్శనంతో పాటు, ట్రస్ట్ దాతలకు వసతి కూడా అందుబాటులో ఉంటుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అదనపు విరాళం లేకుండా తల్లిదండ్రులతో పాటు దర్శనం చేసుకోవచ్చు, కానీ వారు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్ చూపించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.