దారుణం.. మూడోసారి కూడా కూతురు పుట్టిందని భార్యను సజీవ దహనం చేసిన భర్త

మహారాష్ట్రలోని పర్భానీలో ఓ భర్త తన భార్యను సజీవ దహనం చేశాడు. నిప్పు అంటుకున్న ఓ మహిళ రోడ్డుపై మంటలతో అరుస్తూ కనిపించింది. ఆ మహిళ ప్రాణాలను కాపాడేందుకు కొందరు ప్రయత్నించినా ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

కుండ్లిక్ కాలే తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి పర్భానిలోని ఫ్లైఓవర్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కుండ్లిక్ కాలే కొన్ని రోజుల క్రితం మూడోసారి తండ్రి అయ్యాడు. అతనికి అప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈసారి కూడా కొడుకు పుట్టకపోవడంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. దీంతో భార్యను సజీవ దహనం చేశాడు.

ఈ ఘటన తర్వాత నిందితుడి భార్య సోదరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. పోలీసులు కుండ్లిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మహిళ సోదరి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.