టీని రీహీట్ చేసుకుని తాగితే 5 రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్‌లో పబ్లిష్ అయిన అధ్యయనం హెచ్చరిస్తోంది. అవేంటో తెలుసుకుందాం.
ఉదయం లేవగానే టీ (Tea) తాగనిదే చాలా మందికి డే స్టార్ట్ కాదు. కొందరైతే రోజులో నాలుగైదు సార్లు టీ తాగకుండా ఉండలేరు. కాస్త తలనొప్పిగా అనిపించినా, మూడ్ బాగా లేకపోయినా, ఫ్రెండ్స్ కలిసినా ఈ హాట్ రీఫ్రెషింగ్ డ్రింక్ తాగుతారు.
అయితే ఇంట్లో, బయట ఎక్కడైనా ఒక్కసారి చేసిన టీని మళ్లీ వేడిచేసి ఇవ్వడం, తాగడం కామన్. అయితే ఈ అలవాటు మంచిది కాందంటున్నారు డాక్టర్లు. ఇలా టీని రీహీట్ చేసుకుని తాగితే 5 రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్‌లో పబ్లిష్ అయిన అధ్యయనం హెచ్చరిస్తోంది. అవేంటో తెలుసుకుందాం.
రుచిలో మార్పు టీని మళ్లీ వేడి చేస్తే, అందులోని టానిన్స్ డెన్సిటీ పెరుగుతంది. దీంతో డ్రింక్ మరింత చేదుగా, ఎసిడిక్‌గా మారుతుంది. ఈ టానిన్లు బాడీలో మినరల్స్ అబ్సాప్షన్‌కి ఆటంకం కలిగిస్తాయి. ఇలా రీహీట్ చేసిన టీ తాగితే మన జీర్ణ వ్యవస్థలో అసౌకర్యం, అజీర్తి, పోషక లోపాలు, ఇతర అనారోగ్యాలు రావచ్చు.
జీర్ణ వ్యవస్థలో అసౌకర్యం టీని ఎక్కువసార్లు వేడి చేస్తే, దాని ఎసిడిటీ పెరుగుతుంది. ఇది గుండెల్లో మంట, గ్యాస్ట్రిటిస్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలను మరింత పెంచుతుంది. యాసిడ్ జ్యూస్ సెన్సిటివిటీ ఉండే వ్యక్తులు రీహీటింగ్ చేసిన టీ తాగితే కుడపు ఉబ్బరం లేదా చికాకు కలుగుతుంది. డైజెస్టివ్ కాంపౌండ్ల బ్యాలెన్సింగ్ దెబ్బతింటుంది.
బ్యాక్టీరియల్ ఇంపాక్ట్ ఒకసారి ప్రిపేర్ చేసిన టీని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచితే, అందులో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీంతో అది కలుషితం కావచ్చు. టీని మళ్లీ వేడి చేసినా ఈ బ్యాక్టీరియా చనిపోదు. ఇలాంటి డ్రింక్ తాగితే కడుపు నొప్పి, ఆహార సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ల నష్టం టీని మళ్లీ మళ్లీ వేడి చేస్తే, అందులోని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. ఛాయ్‌లో కాటెచిన్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడటం వంటి పనులు చేస్తాయి. అయితే టీని రీహీట్ చేస్తే ఈ కాంపౌండ్లు విచ్చిన్నం అవుతాయి. దీంతో ఈ డ్రింక్ తాగినా పెద్దగా బెనిఫిట్స్ ఉండవు.
కెమికల్ కంపోజిషన్‌లో మార్పులు టీని రీహీట్ చేస్తే దాని టేస్ట్ ప్రొఫైల్, కెమికల్ కంపోజిషన్‌లో మార్పులు వస్తాయి. ముఖ్యంగా, నాణ్యత లేని బౌల్స్ వాడటం వల్ల.. రీహీట్ చేస్తే అందులోకి కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతుంటాయి. ఇవి టీ టేస్ట్, ఫ్లేవర్‌ను మార్చి ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తాయి.
ఈ టిప్స్ ఫాలో అయితే బెటర్! టీ చేసిన మొదటి 15 నిమిషాలలోపు మళ్లీ వేడి చేసుకుంటే పెద్దగా నష్టం ఉండదు. అయితే, రెండోసారి హీట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్లాన్ చేసుకోవాలి. అవసరం ఉన్నంత టీ మాత్రమే పెట్టుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న డ్రింక్‌ను కంటైనర్స్ లేదా థర్మాస్, ఇన్సులేటెడ్ ఫ్లాస్క్‌లో పోసుకోవాలి. ఇవి కొన్ని గంటల పాటు టీని వేడిగా ఉంచగలవు. రీహీట్ చేయడం తప్పదు అని అనుకుంటే, సిమ్‌లో పెట్టి నెమ్మదిగా హీట్ చేసుకోవాలి.
































