మద్యం తాగితే.. షుగర్ తగ్గుతుందా ? పెరుగుతుందా ? డాక్టర్స్ ఏం చెపుతున్నారంటే ?

ఆల్కహాల్ తాగడం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుందని చాలా మంది అనుకుంటారు. అందువల్ల వారు డయాబెటిక్ పేషెంట్ అయినప్పటికీ ధైర్యంగా మద్యం తాగుతుంటారు.


మద్యం సేవించడం ద్వారా మధుమేహాన్ని నిజంగా నియంత్రించవచ్చా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. అసలు మధుమేహ రోగులు ఆల్కహాల్ తీసుకోవడం రక్తంలో చక్కెరపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మధుమేహ వ్యాధిగ్రస్తులు మద్యం సేవించాలా? అసలు దీని గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహం ఉన్న వ్యక్తులు మద్యం సేవించడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది లేదా చాలా వేగంగా పడిపోతుంది. ఈ రెండు పరిస్థితులు మధుమేహ రోగులకు ప్రమాదకరమే. ఆల్కహాల్‌ కూడా అత్యధిక కేలరీలు కలిగి ఉంటుంది. ఇది మధుమేహ రోగులకు మంచిది కాదు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆల్కహాల్ రక్తంలో చక్కెర స్థాయిలలో వేగవంతమైన హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. అసలు మద్యం సేవించడం మీకు సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి, మీరు మీ వైద్యుని నుండి సలహా పొందవచ్చు.

నిపుణుల అధ్యయనం ప్రకారం తక్కువ పరిమాణంలో ఆల్కహాల్ తాగడం వల్ల కూడా మీ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అలాంటిది అధికంగా మద్యం తీసుకుంటే మీ షుగర్ స్థాయి ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ రోగులకు ఆల్కహాల్ సేవించడం మరింత ప్రమాదకరం

బీర్ వైన్ లో కూడా చక్కెర స్థాయిలు కలిగి ఉంటాయి. ఇవి కూడా రక్తంలో చక్కెరను పెంచుతాయి. అంతేకాకుండా ఆల్కహాల్ మీ ఆకలిని పెంచి అవసరమైన దానికంటే ఎక్కువగా తినేలా చేస్తుంది. అప్పుడు మీ చెక్కెర స్థాయి అదుపులో లేకుండాపోతుంది. మద్యపానం కూడా రక్తపోటును పెంచుతుంది. దీన్ని బట్టి ఆల్కహాల్ శరీరానికి ఎటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుందనడానికి ఇప్పటి వరకు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు.