స్మార్ట్ హోమ్ కంట్రోలర్
ఇప్పుడు చాలామంది ఇళ్లలో స్మార్ట్ బల్బులు, స్మార్ట్ ప్లగ్స్ వంటి ఐఒటి (IoT) డివైజ్‌లు వాడుతున్నారు. వీటిని కంట్రోల్ చేయడానికి ప్రతిసారీ మీ ఫోన్‌ను వాడటం ఇబ్బందిగా ఉండొచ్చు. అందుకే మీ పాత ఫోన్‌ను ఇంటి మధ్యలో ఒక గోడకు లేదా టేబుల్‌కు సెట్ చేసి, దాన్ని ఒక రిమోట్ కంట్రోల్ లాగా వాడవచ్చు. ఇంట్లో అందరూ ఈ ఫోన్ ద్వారా లైట్లను ఆఫ్ లేదా ఆన్ చేయడం ఈజీ అవుతుంది.
పిల్లలకు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్
చిన్న పిల్లలను స్మార్ట్‌ఫోన్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీ కొత్త ఫోన్‌ను వారికి ఇస్తే డేటా డిలీట్ అయ్యే రిస్క్ ఉంది. పొరపాటున ఫోన్ కింద పడితే డ్యామేజ్ కావచ్చు. అందుకే కొత్త మొబైల్ బదులుగా, మీ పాత ఫోన్‌ను వారికి ఇవ్వండి. అయితే డివైజ్‌లోని ముఖ్యమైన డేటా, యాప్స్ తీసేసిన తర్వాతే చిన్నారులకు ఫోన్ ఇవ్వండి. అందులో యూట్యూబ్ కిడ్స్ (YouTube Kids), ఎడ్యుకేషన్ రిలేటెడ్ గేమ్స్ ఇన్‌స్టాల్ చేయండి.
ఇంటికి CC కెమెరా
సెక్యూరిటీ కోసం వేల రూపాయలు ఖర్చు చేసి CCTV కెమెరాలు కొనే బదులు, మీ పాత స్మార్ట్‌ఫోన్‌నే పవర్‌ఫుల్ సెక్యూరిటీ కెమెరాగా మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆల్ఫ్రెడ్ (Alfred) లేదా మెనీథింగ్ (Manything) వంటి యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఫోన్‌ను ఇంటిలోని ఒక మూలలో లేదా మెయిన్ డోర్ దగ్గర సెట్ చేసి, వైఫై (Wi-Fi)కి కనెక్ట్ చేయండి. అప్పుడు మీ ఇంటిని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మానిటర్ చసుకోవచ్చు. మోషన్ డిటెక్షన్ వంటి ఫీచర్లతో రాత్రి పగలు తేడా లేకుండా ఇది ఎప్పుడైనా పనిచేస్తుంది.
వైఫై హాట్‌స్పాట్
మీ ఇంట్లో వైఫై లేకపోతే, పాత ఫోన్‌ను హాట్‌స్పాట్‌గా వాడుకోవచ్చు. అలాగే దీన్ని కేవలం ఈమెయిల్స్ చెక్ చేయడానికి, డాక్యుమెంట్లను స్కాన్ చేయడానికి లేదా మ్యాప్స్ నావిగేషన్ కోసం వాడుకుంటూ మల్టీ టాస్కింగ్‌ను సింపుల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కొత్త ఫోన్ ఎప్పుడైనా పని చేయడం ఆగిపోతే, పాత ఫోన్ మీకు రెడీగా అందుబాటులో ఉంటుంది.
మ్యూజిక్, స్ట్రీమింగ్
రెగ్యులర్‌గా సాంగ్స్ వినడం ఇష్టమా? లేదా బ్రౌజింగ్, రీల్స్ చూడటం మీకు అలవాటా? అయితే ఈ అవసరాలకు మీ కొత్త ఫోన్ వాడితే, దాని బ్యాటరీ త్వరగా డౌన్ అయిపోవచ్చు. పైగా మ్యూజిక్ వింటున్నప్పుడు కాల్స్ వస్తే సాంగ్ పాజ్ అవుతుంది. దీంతో డిస్ట్రబ్‌గా ఫీల్ అవుతారు. ఇలాంటి సమస్యలు రాకుండా, మీ పాత ఫోన్‌ను ఒక మినీ మీడియా ప్లేయర్‌గా మార్చుకోవచ్చు. దీన్ని బ్లూటూత్ స్పీకర్స్‌కు ఫిక్స్‌డ్‌గా కనెక్ట్ చేసి పెట్టుకొని, ఎప్పుడైనా మీకు ఇష్టమైన పాటలు వినొచ్చు. స్పాటిఫై (Spotify) లేదా జియోసావన్ వంటి యాప్స్ వాడుతూ, మీ మెయిన్ ఫోన్‌ను కేవలం కాల్స్, మెసేజ్‌ల కోసం వాడుకోవచ్చు.


































