Devotional – దేవుడి విగ్రహాలను పూజించేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తే పుణ్యానికి బదులు పాపం వస్తుంది..?

సాధారణంగా మనదేశంలో దేవుడి పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. హిందూ పురాణాల ప్రకారం ప్రతిరోజు దేవున్ని పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. అందువల్ల ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో దేవుని పూజించడమే కాకుండా దేవాలయాలకు వెళ్లి మరి భగవంతుడిని పూజిస్తూ ఉంటారు.


అయితే సాధారణంగా ప్రతి ఇంట్లో పూజ గదిలో దేవుడి ఫోటోలతో పాటు దేవుడి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇలా ప్రతిరోజు దేవుడి ఫోటోలకు విగ్రహాలకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే దేవుడి విగ్రహాలను, ఫోటోలను పూజించే విధానంలో చాలా మార్పులు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా దేవుడి చిత్రపటాలకు దేవుడి విగ్రహాలకు పూజ చేసే సమయంలో వేరువేరు నియమాలు పాటించవలసి ఉంటుంది.

ఇలా దేవుడి విగ్రహాలను పూజించే సమయంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విగ్రహారాదణ ను సిద్ధ ఆరాధన అని కూడా అంటారు. ఇక ఫోటో ఆరాధన మనసా ఆరాధన రూపంలో ఉంటుంది. సిద్ధ పూజ అంటే పూర్తి పద్ధతితో చేసే ఆరాధన అని అర్థం. మానస పూజా అంటే మనసుతో చేసే మానసిక ఆరాధన అని అర్థం. విగ్రహారాధన చేసే సమయంలో తప్పనిసరిగా ఆసనం పై కూర్చొని విగ్రహారాధన చేయాలి. ఇలా చేయని యెడల ఆ పూజకు ఫలితం ఉండదు. ఇక చిత్రపటానికి పూజలు చేసేటప్పుడు ఆసనం పై కూర్చోవాల్సిన నియమం లేదు.

విగ్రహారాధన చేసే సమయంలో అభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అలాగే విగ్రహధారణలో సాధన చేయడం ద్వారా మన కోరికను భగవంతునికి తెలుపవచ్చు.అయితే చిత్ర పటాన్ని పూజించే సమయంలో సాధన చేయటం తప్పనిసరి కాదు. ఇంట్లో విగ్రహారాధన చేయాలంటే విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాతే పూజలు నిర్వహించాలి. అంతేకాకుండా ఇంట్లో ఆరాధించే విగ్రహం పరిమాణం మూడు అంగుళాల కన్నా ఎక్కువ మించకుండా ఉండాలి. ఇలా ప్రతిరోజు ఇంట్లో ఈ నియమాలను పాటిస్తూ విగ్రహారాధన చేయాలి. ఇలా నియమాలు అనుసరించకుండా విగ్రహారాధన చేయటం వల్ల పుణ్యఫలం సంగతి ఏమో కానీ పాపం వస్తుంది.