Vastu : మోహినీ మొక్క .. దీన్ని పెంచుకోవాల.. కాసుల గలగల..

Jade Plant : మీకు కొత్త కొత్త మొక్కలు పెంచుకోవడం ఇష్టమా?
అయితే.. మోహినీ మొక్క మీకు బాగా నచ్చుతుంది. దీన్ని ఇంగ్లీష్‌లో జేడ్ ప్లాంట్ అంటారు. మందమైన చిన్న ఆకులతో చాలా అందంగా ఉంటుంది. వాస్తు సంగతి అలా ఉంచితే.. శాస్త్రీయంగా కూడా ఈ మొక్క వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్క శాస్త్రీయనామం క్రాస్సులా ఒవాటా లేదా క్రాస్సులా అర్జెంటీ. నీడలో, ఇంటి లోపల పెంచుకునే మొక్క ఇది. వాస్తు ప్రకారం ఇది అదృష్టం తెచ్చిపెడుతుంది. అందుకే ఇళ్లు, ఆఫీసుల్లో ఇది కనిపిస్తుంది. ఎక్కువ కాలం బతికే ఈ మొక్క వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

వేడి మాయం : మీ ఇంట్లో వేడిగా ఉంటుందా? అయితే.. చల్లదనం కోసం మీరు ఈ మొక్కను పెంచవచ్చు. ఇది ఇంట్లోని కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చేస్తుంది. దాంతో గది చల్లబడుతుంది. అందుకే ఒక్కో గదిలో ఒకటి లేదా రెండు మొక్కల్ని ఉంచుకుంటే మేలు.

ఇళ్లలోని గోడలపై వేసే పెయింట్ల నుంచి వచ్చే ప్రమాదకరమైన ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOC)లను ఈ మొక్కలు తొలగిస్తాయి. అంతేకాదు కీటకాలు, పురుగులూ వదిలేసే వ్యర్థాల నుంచి మనకు హాని కలగకుండా చేస్తాయి.

Related News

డయాబెటిస్ : ఇండియాలో డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారు జేడ్ లీఫ్ టీ తాగొచ్చు. ఈ టీ ప్యాకెట్లు ఈ-కామర్స్ సైట్లలో లభిస్తాయి. ఈ మొక్కలు కూడా ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు.

ఈ మొక్కను ఇంట్లోనే పెంచుకున్నా.. కొద్దిగా అయినా ఎండ తగిలేలా చూసుకోండి. రోజూ కనీసం 4 గంటలు దీనికి వేడి ఉంటే మంచిది. ఆ వేడి ద్వారానే ఇది ఆహారం తయారుచేసుకుంటుంది. వీటికి నీరు ఎక్కువ అవసరం లేదు. ఒకసారి పోశాక.. మట్టి పూర్తిగా పొడి అయ్యాక మళ్లీ పొయ్యాలి.

ఎక్కడ ఉంచాలి? : మోహినీ మొక్క మనీ ప్లాంట్ అని కూడా అంటారు. దీన్ని ఎక్కడ ఉంచితే ఎక్కువ లాభాలు కలుగుతాయి అనే అంశంపై వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పిన సూచనలున్నాయి. వాటి ప్రకారం.. ఇంట్లో లేదా గదిలో ఆగ్నేయ మూలలో దీన్ని ఉంచాలి. అలా కుదరకపోతే.. తూర్పు వైపు ఉంచాలి.

గుడ్ లక్ : ఇంటి ముందు లేదా ఆఫీస్ ముందు ఈ మొక్క ఉంటే.. అదృష్టం కలిసొస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

అక్కడ వద్దు: అందంగా ఉంది కదా అని కొంతమంది ఈ మొక్కను బెడ్‌రూమ్ లేదా బాత్‌రూంలో ఉంచుతారు. అలా వద్దంటున్న వాస్తు నిపుణులు.. అలా చేస్తే.. మొక్కకు ఉన్న పాజిటివ్ ఎనర్జీ పోతుందని చెబుతున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.

Related News