మీ కళ్లు చెప్పే ఈ విషయాలను లైట్ తీసుకుంటే మీ పని అయిపోయినట్లే.

న కళ్ళు కేవలం చూడటానికి మాత్రమే కాదు.. మన మొత్తం ఆరోగ్యాన్ని, ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని చెప్తాయని నిపుణులు తేల్చారు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం..


సాధారణ కంటి పరీక్ష ద్వారా గుండెపోటు, స్ట్రోక్ వంటి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ నివేదిక ప్రకారం.. కళ్ల లోపల ఉండే రెటీనా రక్త నాళాలు శరీరంలోని మొత్తం రక్త ప్రసరణ వ్యవస్థ స్థితిని ప్రతిబింబిస్తాయి.

రెటీనా ఎలా అద్దంలా పనిచేస్తుంది..?

శరీరంలో రక్త ప్రసరణలో సమస్య ఉన్నప్పుడు లేదా రక్తపోటు పెరిగినప్పుడు.. కంటిలోని ఈ సూక్ష్మ సిరలు మొదట ప్రభావితమవుతాయి. గుండె జబ్బులు నెమ్మదిగా మొదలవుతాయి. అయితే కళ్ళలోని రక్త నాళాలు చాలా సన్నగా, సున్నితంగా ఉండటం వలన శరీరంలోని ఇతర భాగాల కంటే ముందుగానే వాటిలో మార్పులు కనిపిస్తాయి. ఈ నాళాలు లీక్ కావడం మొదలుపెడితే.. అది మొత్తం రక్త ప్రసరణ వ్యవస్థ ఒత్తిడిలో ఉందని సూచిస్తుంది.

కంటి స్కాన్‌తో ప్రమాద హెచ్చరిక

ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ వంటి అధునాతన కంటి స్కాన్‌లు రెటీనా రక్త నాళాలలో జరిగే చిన్న మార్పులను కూడా సులభంగా గుర్తించగలవు. ఈ స్కాన్‌లు రెటీనాలో అధిక రక్తపోటు, రక్తం గడ్డకట్టడం లేదా రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించే ఫలకాలు వంటి పరిస్థితులను వెల్లడిస్తాయి. ఇవన్నీ అధిక రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్ లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని సూచిస్తున్నాయి. కొన్నిసార్లు కంటికి రక్త ప్రవాహం తాత్కాలికంగా ఆగిపోయినప్పుడు, రెటీనాపై చిన్న మచ్చలు ఏర్పడతాయి. దీనిని ఐ స్ట్రోక్ అంటారు. ఇది గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు సంభావ్యతను తెలియజేస్తుంది.

ఎప్పుడు పరీక్ష చేయించుకోవాలి..?

AAO నిపుణుడు డాక్టర్ జోసెఫ్ న్జెగోడా ప్రకారం.. OCT స్కాన్‌లు కేవలం కంటి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా గుండె జబ్బులు లేదా నరాల దెబ్బతినడానికి దారితీసే రక్త నాళాలలో ముందస్తు మార్పులను తెలుసుకోవడానికి కూడా సహాయపడతాయి. ఈ సంకేతాలను ముందుగా గుర్తిస్తే, జీవనశైలి మార్పులు లేదా మందులతో తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు.

వీరికి రెగ్యులర్ చెకప్ తప్పనిసరి

ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. ముఖ్యంగా కింది లక్షణాలు ఉన్నవారు తరచుగా

  • రెటీనా ఇమేజింగ్ చేయించుకోవాలి.
  • అధిక రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ ఉన్నవారు.
  • డయాబెటిస్ ఉన్నవారు.
  • ధూమపానం చేసేవారు.
  • గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారు.
  • 40 ఏళ్లు పైబడిన వారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.