ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలంటే.. తాజా గైడ్ లైన్స్

రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా పలు ప్రధాన మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. సంక్రాంతి సమయంలో ఇప్పటికే అన్ని ముఖ్య మైన రైళ్లల్లో రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి.


దీంతో.. ప్రత్యేక రైళ్ల ఏర్పాటు పైన కసరత్తు చేస్తున్నారు. ఇక.. రైళ్లల్లో ప్రయాణం సమయంలో లోయర్ బెర్తుకు ప్రత్యేకంగా డిమాండ్ ఉంటుంది. లోయర్ బెర్తు కేటాయింపు పైన రైల్వే శాఖ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. వీటిని ఫాలో అవ్వటం ద్వారా లోయర్ బెర్తు సులభంగా దక్కించుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో నుంచి దూర ప్రయాణాలకు ఎక్కువ మంది రైలుకే ప్రాధాన్యత ఇస్తారు. కాగా, అందునా లోయర్ బెర్తు కోసం ఎక్కువ మంది ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ .. ఐఆర్సీటీసీ ద్వారా ఎక్కవ శాతం టికెట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. లోయర్ బెర్తుకు ప్రయాణీకుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ఐఆర్సీటీసీ సైతం కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. రిజర్వేషన్ సమయంలోనే ఈ ఆప్షన్ ద్వారా లోయర్ బెర్తును పొందవచ్చు. అదే విధంగా రైల్వే ఇప్పటికే ప్రయాణం చేసే వారిలో కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి లోయర్ బెర్తు ఆటో మేటిక్ గా టికెట్ బుకింగ్ సమయంలోనే ఖరారు అయ్యేలా అమలు చేస్తోంది. అయితే.. ఆ నిబంధనలకు లోబడి ఉన్నా కొంత మందికి లోయర్ బెర్తు దక్కటం లేదు.

కాగా, రైల్వే సూచనల మేరకు టికెట్ బుక్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల లోయర్ బెర్త్ వచ్చే అవకాశముంది. రైలులో ప్రయాణించే 60 ఏళ్లు దాటిన వృద్దులు, 45 ఏళ్లు దాటిన మహిళలకు బెర్త్‌ల కేటాయింపుల్లో ప్రత్యేక కోటాను రైల్వేశాఖ అందిస్తోంది. దీని ద్వారా బుకింగ్ చేసుకునే సమయంలో సీనియర్ సిటీజన్ కోటా ఎంచుకుంటే లోయర్ బెర్త్‌లు వెంటనే కేటాయిస్తారు. కానీ టికెట్ బుకింగ్ చేసే సమయంలో వారితో పాటు నాన్ సీనియర్ సిటిజన్ సభ్యులు ఉంటే లోయర్ బెర్ దక్కదు. వారి స్థానంలో మరో సీనియర్ సిటిజెన్ కు లోయర్ బెర్తు కేటాయించేందుకు ఈ మార్పు చేసారు. ఇక.. టికెట్ బుకింగ్ సమయంలో వృద్దులు, గర్భిణులు ఉంటే వారికి మీతో పాటు కాకుండా ప్రత్యేకంగా వేరే టికెట్లు బుక్ చేయాలని సూచిస్తున్నారు. దీంతో, వారికి లోయర్ బెర్త్ కేటాయిస్తారు. ఒక టికెట్‌పై ఒకరు లేదా ఇద్దరు సీనియర్ సిటీజన్లు ప్రయాణించేటప్పుడు వారికి ఆ కోటా వరిస్తుంది. కానీ వారితో పాటు నాన్ సీనియర్ సిటిజన్ సభ్యులు ఒకే టికెట్‌పై బుక్ చేసుకుంటే జనరల్ కేటగిరీగా పరిగణిస్తారు. అలాంటి సమయంలో లోయర్ బెర్త్ రాదని చెబుతున్నారు.

సాధారణంగా రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడు ఒక పీఎన్ఆర్ పై ఇద్దరు సీనియర్ సిటిజన్లకు కూడా ఈ కోట వర్తిస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ సీనియర్ సిటిజన్ ఉంటే వారికి లోయర్ బెర్త్ దొరకడం కష్టతరమవుతుంది. అయితే వేర్వేరు పీఎన్ఆర్ ల పై టికెట్ బుక్ చేస్తే మాత్రం లోయర్ బెర్త్ దొరికే అవకాశం దక్కుతుంది. కాగా, స్లీపర్‌కు సంబంధించి ప్రతీ కోచ్‌లో ఏడు లోయర్ బెర్త్‌లను సినీయర్ సిటిజన్ కోటా కింద కేటాయిస్తారు. ఇక ఏసీ త్రీటైర్‌లో ఐదు, 2 టైర్‌లో 4 బెర్తులు వారికి కేటాయిస్తారు. వృద్దులు, గర్భిణులతో కలిసే ప్రయణించాలనుకుంటే వారిని ప్రత్యేకంగా టికెట్ బుక్ చేసుకుంటే లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. ఒకే టికెట్‌పై అందరూ ప్రయాణించాలనుకుంటే జనరల్ కేటగిరీగా పరిగణించి లోయర్ బెర్త్ వచ్చే అవకాశం ఉండదు. దీంతో.. తాజా నిబంధనలకు అనుగుణంగా ముందుగానే ప్రయాణం రిజర్వేషన్ చేయించుకోవటం ద్వారా లోయర్ బెర్తు పొందే అవకాశం ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.