పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని విజయవాడలో గురువారం రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. బుధవారం ఇఫ్తార్ వేదిక… ఏ ప్లస్ కన్వెన్షన్ వద్ద మైనార్టీ సంక్షేమ శాఖ సీఈవో శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా అధికారులు, సిబ్బందితో ఏర్పాట్లపై మంత్రి చర్చించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్ర స్థాయిలో ఇఫ్తార్‌కు రూ.75 లక్షలు మంజూరు చేసింది. ఈ నెల 27, గురువారం విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు.’ అని మంత్రి ఫరూక్ వివరించారు.