బడ్జెట్‌లో ఆదాయపన్ను (Union Budget)పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. రూ. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. దీంతోపాటు కొత్త ఆదాయపు పన్ను విధానంలో శ్లాబ్‌లను మార్చారు. దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే రూ.12,75,000 వరకు పన్ను ఉండదు.
కొత్త పన్ను విధానంలో మార్చిన శ్లాబ్‌లు..
రూ.0-4 లక్షలు – సున్నా
రూ.4-8 లక్షలు – 5%
రూ.8-12 లక్షలు – 10%
రూ.12-16 లక్షలు – 15%
రూ.16-20 లక్షలు – 20%
రూ.20-24 లక్షలు – 25%
రూ.24 లక్షల పైన 30 శాతం