రూ. 21లక్షల వరకు ప్యాకేజీతో ఇన్ఫోసిస్​ ఆఫ్​ క్యాంపస్​ డ్రైవ్​​.. అప్లికేషన్​కి ఇంకా 2 రోజులే ఛాన్స్​

ఐటీ రంగంలో స్థిరపడాలనుకునే వారి కోసం ఇన్ఫోసిస్ ఆఫ్​ క్యాంపస్​ డ్రైవ్​ని కొనసాగిస్తోంది. భారీ పే ప్యాకేజీతో ఈ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ జరుగుతోంది. అప్లికేషన్​కి ఇంకా రెండు రోజులే ఛాన్స్​ ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సాఫ్ట్‌వేర్ రంగాన్ని కెరీర్​గా ఎంచుకోవాలని చూస్తున్న వారికి కీలక అప్డేట్​. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​కి సంబంధించిన ఆఫ్​ క్యాంపస్​ మాస్​ హైరింగ్​ 2025 ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ మల్టీనేషనల్ కంపెనీలో అడుగుపెట్టేందుకు మీకు ఇదే సరైన అవకాశం. 2025 పాసౌట్​ బ్యాచ్​ వారికోసం ప్రత్యేకంగా జరుగుతున్న ఈ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..


ఇన్ఫోసిస్​ ఆఫ్​ క్యాంపస్​ రిక్రూట్​మెంట్​ 2025- పోస్టులు, జీతాలు..

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు ఆకర్షణీయమైన శాలరీ ప్యాకేజీలను ఇన్ఫోసిస్ ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా ‘స్పెషలిస్ట్ ప్రోగ్రామర్’ వంటి పోస్టులకు కళ్లు చెదిరే ప్యాకేజీలు ఇస్తోంది. అవి..

స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్​3 (ట్రైనీ): ఏడాదికి రూ. 21 లక్షల ప్యాకేజీ.

స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్​2 (ట్రైనీ): ఏడాదికి రూ. 16 లక్షల ప్యాకేజీ.

స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్​1 (ట్రైనీ): రూ. 10 లక్షల ప్యాకేజీతో పాటు రూ. 1 లక్ష జాయినింగ్ బోనస్.

డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ): రూ. 6.25 లక్షల ప్యాకేజీతో పాటు రూ. 75,000 జాయినింగ్ బోనస్.

టెక్నికల్ స్కిల్స్, సమస్య పరిష్కార సామర్థ్యం, రియల్ టైమ్ ప్రాజెక్టులపై ఆసక్తి ఉన్న వారికి ఈ హోదాలు చక్కగా సరిపోతాయి.

ఇన్ఫోసిస్​ ఆఫ్​ క్యాంపస్​ రిక్రూట్​మెంట్​ 2025- అర్హత ప్రమాణాలు..

ఈ డ్రైవ్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ఈ కింది అర్హతలు కలిగి ఉండాలి:

బీఈ / బీటెక్​,

ఎంఈ / ఎంటెక్​,

ఎసీఏ లేదా ఎంఎస్​సీ (5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్).

అర్హత కలిగిన బ్యాచ్: కేవలం 2025లో ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఇన్ఫోసిస్​ ఆఫ్​ క్యాంపస్​ రిక్రూట్​మెంట్​ 2025- దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇన్ఫోసిస్ అధికారిక అప్లికేషన్ లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు స్వయంగా ఫారమ్ నింపాల్సి ఉంటుంది. మీరు అందించిన వివరాల ఆధారంగా ఇన్ఫోసిస్ టీమ్ దరఖాస్తులను స్క్రీనింగ్​ చేస్తుంది. ఆపై అర్హులను తదుపరి రౌండ్లకు ఎంపిక చేస్తుంది.

కాగా, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ గురువారం, డిసెంబర్ 25, 2025 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్లికేషన్​కి ఇంకా రెండు రోజుల అవకాశం మాత్రమే ఉంది.

ఐటీ ఇండస్ట్రీలో బలమైన పునాది వేయాలనుకునే ప్రతిభావంతులైన యువతకు ఇదొక సువర్ణావకాశం. మెరుగైన శిక్షణ, మంచి పని వాతావరణం, దీర్ఘకాలిక కెరీర్ వృద్ధిని ఇన్‌ఫోసిస్ అందిస్తోంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు ఆఖరి నిమిషం వరకు ఆగకుండా ముందే అప్లై చేసుకోవడం ఉత్తమం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.