నెలకు ₹4,000 పెట్టుబడి.. 30 ఏళ్లలో ₹1.41 కోట్లు .. చిన్న జీతంతోనే కోటీశ్వరుడు ఎలా??

చిన్న జీతం ఉన్నా, సేవింగ్ & ఇన్వెస్ట్‌మెంట్ సాధ్యమే. చాలామంది తక్కువ జీతం వల్ల సేవింగ్ చేయలేమనుకుంటారు. కానీ నిజానికి మీ ఆదాయంపై కాదు, మీ అలవాట్లపై సేవింగ్ ఆధారపడి ఉంటుంది. సరైన స్ట్రాటజీతో మీరు చిన్న జీతంతోనే కోటీశ్వరుడిగా మారొచ్చు.


సేవింగ్ ఎందుకు అవసరం?
సేవింగ్ అనేది భవిష్యత్తుకు పెట్టుబడి వంటి‍ది.
తక్కువ ఆదాయం ఉన్నా, తప్పనిసరిగా కొంత మొత్తాన్ని సేవ్ చేయాలి.
తగిన పెట్టుబడి ఎంపిక చేస్తే, చిన్న మొత్తాలు కూడా పెద్ద ఫండ్‌గా మారతాయి.

ఎంత సేవ్ చేయాలి?
సాధారణంగా మీ జీతం కనీసం 20% సేవ్ చేయాలి.
ఉదాహరణకు, మీ జీతం ₹20,000 అయితే, కనీసం ₹4,000 సేవ్ చేయాలి.
మొదట చిన్న మొత్తం అనిపించినా, పెద్ద నిధిగా మారతుంది.

SIP మేజిక్ – చిన్న పెట్టుబడి, పెద్ద ఫలితం
SIP (Systematic Investment Plan) మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి అద్భుతమైన మార్గం.
SIP ద్వారా సగటు సంవత్సరాల రిటర్న్ 12% వరకు పొందొచ్చు.

₹4,000 SIPను 28 ఏళ్లపాటు కొనసాగిస్తే:
మొత్తం పెట్టుబడి = ₹13,44,000
పెట్టుబడిపై మొత్తం రాబడి = ₹1.10 కోట్లు
ఈ SIPని 30 ఏళ్లపాటు కొనసాగిస్తే:

మొత్తం పెట్టుబడి = ₹14,40,000
పెట్టుబడిపై మొత్తం రాబడి = ₹1.41 కోట్లు

ముగింపు
కోటీశ్వరుడు కావడానికి పెద్ద జీతం అవసరం లేదు
సమయానికి ప్రారంభించండి, సరైన ఇన్వెస్ట్‌మెంట్ చేయండి, ఓపికగా ఉండండి
నేడు చిన్న సేవింగ్, భవిష్యత్తులో పెద్ద సంపద
మీ పెట్టుబడులను ప్లాన్ చేసుకుని భవిష్యత్తును భద్రపరుచుకోండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.