అమెరికాలో భారతీయ ఉద్యోగులు పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా?.. 4 నిమిషాల్లో..

 అమెరికన్ కంపెనీ భారతీయ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే.. ఉద్యోగాల నుంచి తొలగించింది. ఒకే ఒక్క గ్రూప్ ఫోన్ కాల్‌ ద్వారా వారిని తొలగించింది.


దీనికి పెద్ద కారణాలను కూడా వెదుక్కోవాల్సిన అవసరం రాలేదా సంస్థకు. నాలుగంటే ఆలస్యంగా లాగిన్ కావడాన్ని కారణంగా చూపించింది. ఆలస్యంగా లాగిన్ అయినందుకు వారిని తొలగించినట్లు వెల్లడించింది.

దీనికి సంబంధించిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేటు పడ్డ ఉద్యోగి ఒకరు దీన్ని పోస్ట్ చేశారు. తాను ఓ అమెరికన్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిన పని చేస్తోన్నాడా ఉద్యోగి. రోజులాగే ఉదయం 9 గంటలకు లాగిన్ అయ్యాడు. అదే సమయంలో 11 గంటలకు సీఓఓతో భారతీయ ఉద్యోగులందరికీ తప్పనిసరి మీటింగ్ ఉందనే క్యాలెండర్ ఇన్వైట్ చూశాడు. 11 గంటలకు మీటింగ్‌కి అటెండ్ అయ్యాడు. ఆయన 11:01 నిమిషాలకు సీఓఓ మీటింగ్ కు జాయిన్ అయ్యాడు. అందరి కెమెరాలు, మైక్రోఫోన్లను ఆఫ్ చేశాడు.

భారతీయ ఉద్యోగుల్లో ఎక్కువ మందిని తొలగిస్తోన్నామని, ఇది వారి పనితీరు ఆధారంగా కాకుండా అంతర్గతంగా చేపట్టిన సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వివరించాడు. లేఆఫ్ ఎదుర్కొన్న వారికి ఓ ఇమెయిల్ వస్తుందని తెలియజేశాడు. ఆ తర్వాత ఉద్యోగుల నుంచి ఎటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే మీటింగ్ నుంచి నిష్క్రమించాడని ఈ పోస్ట్ లో వివరించాడు.

తొలగింపుల విషయంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశాడు. అక్టోబర్ జీతం నెలాఖరున చెల్లిస్తామని, మిగిలిన సెలవులను నగదుగా ఇస్తామని హెచ్ఆర్ నుంచి మెయిల్ అందినట్లు తెలిపాడు. చెప్పారు. కనీస సమాచారం ఇవ్వకుండా నాలుగు నిమిషాలు ఆలస్యంగా లాగిన్ అయ్యామనే కారణంతో తొలగించడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నాడు. ఉద్యోగం కోల్పోవడం తనకు ఇదే మొదటిసారని వాపోయాడు.

సోషల్ మీడియాలో దీనిపై చాలా మంది స్పందించారు. కొందరు సానుభూతిని చూపించారు. మరికొందరు జాబ్ ఆఫర్ కూడా చేశారు. ఫైనాన్స్ సర్వీస్ రంగంలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటే తాను కొత్త జాబ్ కోసం సిఫారసు చేస్తానని ఓ యూజర్ రిప్లై ఇచ్చాడు. జాబ్ పోయినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోగలననని, తాను కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని మరో యూజర్ కామెంట్స్ పెట్టాడు. ప్రతి ఒక్కరూ కెరీర్‌లో కనీసం ఒక్కసారైనా ఉద్యోగం కోల్పోతారని ఊరడించాడు.

లేఆఫ్‌లు అత్యంత దారుణమైన విషయమని మరో యూజర్ వ్యాఖ్యానించాడు. దీని బారిన పడి తాను రెండుసార్లు ఉద్యోగం కోల్పోయానని, ఆ సమయంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చిందని వివరించాడు. లేఆఫ్‌ ప్రక్రియ ఉద్యోగులకు ఎప్పుడూ బాధగానే ఉంటుందని పేర్కొన్నాడు. ఈ పరిస్థితి ఇప్పటికీ తనను భయపెడుతుంటుందని చెప్పాడు. లేఆఫ్స్ నుంచి ఆయా కంపెనీలను నియంత్రించడానికి బలమైన చట్టాలు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.