వెండి ధర మార్కెట్లో అడ్డు అదుపు లేకుండా వేగంగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. చరిత్రలో ఎప్పుడు కూడా వెండి ధర ఈ స్థాయిలో పెరగలేదు. వెండి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం.
సిల్వర్ ధర ప్రస్తుతం ఆల్ టైం రికార్డును నమోదు చేసి 2.10 లక్షల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ఆల్ టైం రికార్డ్ స్థాయిగా చెప్పవచ్చు. సిల్వర్ ధరలు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా భారీగా పెరగడం చూడవచ్చు. నిజానికి జనవరి ఒకటో తేదీ 2025న ఒక కేజీ వెండి ధర కేవలం రూ. 80,000 సమీపంలోనే ఉంది. అక్కడి నుంచి ఏకంగా వెండి రెట్టింపు అయి 1.60 లక్షల రూపాయలకు చాలా వేగంగా దూసుకుని వెళ్ళింది. ఇక అంతటితో వెండి పరుగు ఆగలేదు. అక్టోబర్ నెలలో తొలిసారిగా వెండి ఒక కేజీ రెండు లక్షల రూపాయల మార్కు టచ్ చేసింది. వెండి ధర భారీగా పెరగడానికి ప్రధానంగా మార్కెట్లో ఉన్న పరిస్థితులే కారణంగా చెప్పవచ్చు. వెండి కి అనూహ్యంగా పెరిగిన డిమాండ్ వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది.
వెండి ధర ఎందుకు పెరుగుతుంది
>> వెండి ధర పెరగడానికి ప్రధాన కారణం గ్రీన్ ఎనర్జీ డిమాండ్ భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పెరగడమే కారణంగా చెప్పవచ్చు. ఈ గ్రీన్ ఎనర్జీలో ఎక్కువగా సోలార్ ఎనర్జీ ఉత్పత్తి ఉంటుంది. సోలార్ ప్యానల్స్ తయారీ చేయాల్సి ఉంటుంది. ఈ సోలార్ ప్యానల్స్ ఎక్కువగా వెండి ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సోలార్ ఎనర్జీ కోసం సోలార్ ప్యానల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో సోలార్ ప్యానల్స్ పరిశ్రమకు డిమాండ్ పెరిగి వెండి డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది అని చెప్పవచ్చు.
>> ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా వెండి వాడకం పెద్ద ఎత్తున జరుగుతుంది. . ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కూడా భారీగా పెరుగుతున్నట్లు గమనించవచ్చు. ఈ నేపథ్యంలోనే వెండి ధరలో పెరుగుదల చూడవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరిగే కొద్దీ వెండి ధర కూడా పెరగడం చూడవచ్చు. ఎందుకంటే ఈ పరిశ్రమలకు వెండి సప్లై పెరుగుతుంది కనుక, మార్కెట్లో వెండి ధర కూడా పెరిగే అవకాశం ఉంది.
>> వెండి మైనింగ్ తగ్గిపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సాధారణంగా వెండి కి ప్రత్యేకమైన మైనింగ్ ఉండదు. . ఇది జింక్ మైనింగులో వచ్చే ఒక బై ప్రోడక్ట్. ప్రపంచవ్యాప్తంగా జింక్ మైనింగ్ తక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న మైనింగ్ కూడా చాలా ప్రాంతాల్లో నిలిచిపోయింది. ఈ కారణంగా కూడా వెండి ధర భారీగా పెరుగుతోంది.
2026లో వెండి ధర పెరుగుతుందా లేక తగ్గుతుందా
2026 లో కూడా వెండి ధర భారీగా పెరిగే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ బ్యాంకులో ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, జెపి మోర్గాన్, సిటీ గ్రూప్ వంటి సంస్థలు వెండిని 2026 లో కూడా బుల్లిష్ గా ఉండే అవకాశం ఉందని చెప్పాయి.
వెండిలో ఎలా పెట్టుబడి పెట్టాలి
వెండిలో పెట్టుబడి పెట్టేందుకు అత్యంత సురక్షితమైన మార్గం సిల్వర్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టడమే అని ఇప్పుడు సూచిస్తున్నారు. సిల్వర్ ఈటీఎఫ్ స్కీముల నిర్వహణ చాలా సులభం. ఇందులో మీరు ఎలాంటి ఫిజికల్ సిల్వర్ కొనాల్సిన పనిలేదు.
అందుబాటులో ఉన్న సిల్వర్ ఈటీఎఫ్ స్కీములు ఇవే..
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ (ICICI Prudential Silver ETF)
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ సిల్వర్ ఈటీఎఫ్ (Aditya Birla Sun Life Silver ETF)
నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ (Nippon India Silver ETF)
హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్ (HDFC Silver ETF)
డిఎస్పి సిల్వర్ ఈటీఎఫ్ (DSP Silver ETF)
కోటక్ సిల్వర్ ఈటీఎఫ్ (Kotak Silver ETF)
ఎస్బిఐ సిల్వర్ ఈటీఎఫ్ (SBI Silver ETF)
యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్ (Axis Silver ETF)
నవి సిల్వర్ ఈటీఎఫ్ (Navi Silver ETF)
క్వాంట్ సిల్వర్ ఈటీఎఫ్ (Quant Silver ETF)
Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని పాఠకులకు సూచిస్తోంది.


































