రాప్తాడులో జగన్ హెలికాఫ్టర్ ధ్వంసం

మాజీ ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. రాప్తాడు పర్యటనలో భాగంగా జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడకు చేరుకున్నారు. తిరిగి అదే హెలికాప్టర్ లో జగన్ బెంగళూరు వెళ్లాల్సి ఉంది.


అయితే, భారీగా అభిమానులు తరలి వచ్చారు. జగన్ పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య పరామర్శ పూర్తి చేసుకొని వచ్చే సమయానికి హెలికాప్టర్ డామేజ్ కావటంతో.. పైలెట్లు అందులో ప్రయాణానికి తిరస్కరించారు. సరైన భద్రత లేని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

అనూహ్య ఘటన

మాజీ ముఖ్యమంత్రి రాప్తాడు పర్యటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చేరకు న్నారు. అక్కడ జగన్ చేరుకునే సమయానికి పెద్ద సంఖ్యలో పార్టీ కేడర్.. అభిమానులు తరలి వచ్చారు. జగన్ అక్కడ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి చోటు చేసుకుంటున్న వరుస సంఘటలన పైన మండిపడ్డారు. వైసీపీ నేతలను ఉద్దేశ పూర్వకంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో చంద్రబాబుకు గులాంగిరీ చేస్తున్న పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగం లో నుంచి తెలిగిస్తామని జగన్ హెచ్చరించారు.

ప్రస్తుతం చట్టానికి అతీతంగా వ్యవహరిస్తున్న వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్ హెచ్చరిం చారు. జగన్ పరామర్శ పూర్తి చేసుకొని తిరిగి హెలిపాడ్ కు వెళ్లే సమయంలో పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు హెలికాప్టర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ హెలికాప్టర్ అద్దాలు స్వల్పం గా దెబ్బ తిన్నాయి. దీంతో, హెలికాప్టర్ అద్దాలు దెబ్బ తిన్నాయి. ఫలితంగా ప్రయాణానికి హెలి కాప్టర్ ఉపయోగించలేమని పైలెట్లు స్పష్టం చేసారు. రోడ్డు మార్గంలో జగన్ బెంగళూరు వెళ్లారు. కాగా, జగన్ పర్యటన సమయంలో భద్రతా లోపం కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో గుంటూరు పర్యటన సమయంలో నూ ఇదే విధంగా భద్రత లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు.