జన్మభూమి ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ మార్పు..! 15 నుంచే

క్షిణమధ్య రైల్వే పరిధిలోని విశాఖపట్నం-లింగంపల్లి స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ఇంటర్ సిటీ రైలు జన్మభూమి ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు చోటు చేసుకుంది.


తెలుగు రాష్ట్రాల కనెక్టింగ్ రైలుగా ఉన్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ కొత్త సమయాల్లోని రైల్వే అధికారులు ప్రకటించారు. తాజా షెడ్యూల్ మేరకు ఇరువైపులా జన్మభూమి రైళ్ల సమయాలూ మారబోతున్నాయి. ఈ కొత్త సమయాలు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయి.

విశాఖపట్నం-లింగంపల్లి మధ్య రెండు వైపులా 12805, 12806 నంబర్లతో జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వీటిలో విశాఖ నుంచి లింగంపల్లికి వెళ్లే రైలు నంబర్ 12805 జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఇకపై విశాఖలో ఉదయం 6.20కి బయలుదేరనుంది. అనంతరం దువ్వాడకు 6.43కు, అనకాపల్లికి 6.58కి, యలమంచిలికి 7.13కు, తునికి 7.38కి, అన్నవరానికి 7.58కి, సామర్లకోటకు 8.33కి, రాజమండ్రికి 9.18కి, తాడేపల్లిగూడానికి 10.03కు, ఏలూరుకు 10.43కు, నూజివీడుకు 11.03కు, విజయవాడకు 12.02కు, తెనాలికి 12.45కు, గుంటూరుకు మధ్యాహ్నం 1.45కు, సత్తెనపల్లికి 1.56కు, పిడుగురాళ్లకు 2.22కు, నడికుడికి 2.43కు, మిర్యాలగూడకు 3.12కు, నల్గొండకు 3.42కు, రామన్నపేటకు 4.14కు, చర్లపల్లికి 6.05కు, సికింద్రాబాద్ కు 6.25కు, బేగంపేటకు 6.41కి, లింగంపల్లికి 7.15కు చేరుకుంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.