బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర, తన అభిమానులను శోకసంద్రంలో నిలిపి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇండియన్ సినిమా ‘హీ మ్యాన్’గా గుర్తింపు తెచ్చుకున్న ధర్మేంద్ర, 300లకు పైగా సినిమాల్లో నటించారు.
ఆయన నటించిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని, ఇండియాలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న నటుల్లో ఒకరిగా నిలబెట్టాయి. తన గ్లామర్‌తో స్క్రీన్‌ని షేక్ చేసిన ధర్మేంద్రపై మనసు పారేసుకున్నవారు ఎందరో! అందులో అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ కూడా ఉంది..
1971లో వచ్చిన ‘గుడ్డి’ మూవీలో ధర్మేంద్ర, జయా బచ్చన్ కలిసి నటించారు. జయా బచ్చన్‌కి ఇదే మొదటి సినిమా. ఈ సినిమాలో నటుడు ధర్మేంద్రని పిచ్చిగా ప్రేమించే, 16 ఏళ్ల స్కూల్ అమ్మాయి పాత్రలో నటించింది జయా. తన నటనకి ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే జయా బచ్చన్, నిజంగానే ధర్మేంద్రతో ప్రేమలో పడిందనే విషయం చాలా మందికి తెలీదు..
‘గుడ్డి’ సినిమాలో నటించినప్పుడు జయా బచ్చన్ వయసు 22 ఏళ్లు. అప్పటికే ధర్మేంద్ర, బాలీవుడ్‌లో స్టార్ హీరో.. ఆ సమయంలో ధర్మేంద్రని చూసి, ప్రేమలో పడిపోయిందట జయా బచ్చన్..
‘నాకు ధర్మేంద్ర అంటే పిచ్చి ప్రేమ. నేను, బసంతి క్యారెక్టర్ ఎందుకు చేయలేదా? అని చాలా సార్లు ఫీల్ అయ్యాను. మొదటిసారి ధర్మేంద్రను సెట్స్‌లో చూసినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఏం చేయాలో తెలియక కాళ్లు, చేతులు ఆడలేదు. అతను చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాడు. తెల్ల ప్యాంటు, తెల్ల షూస్ వేసుకుని, గ్రీక్ గాడ్‌లా అనిపించాడు..’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది జయా బచ్చన్..
జయా బచ్చన్, ధర్మేంద్ర భార్య హేమా మాలిని ముందే ఈ విషయాలను బయటపెట్టడం కొసమెరుపు.. ధర్మేంద్రకు 1954లోనే పెళ్లైంది. ‘గుడ్డి’ సినిమా చేసే సమయానికి ధర్మేంద్రకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. దీంతో జయా బచ్చన్, ధర్మేంద్రపై ప్రేమను తనలోనే దాచుకుంది. అయితే 1980లో తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన ధర్మేంద్ర, బాలీవుడ్ నటి హేమా మాలినిని రెండో వివాహం చేసుకున్నాడు.


































