ఈ ప్లాన్‌తో డేటా, అపరిమిత కాలింగ్, అలాగే ఉచిత యూట్యూబ్ ప్రీమియం సహా అనేక ఓటీటీ (OTT) సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వివరాలను ఇప్పుడు చూద్దాం.
జియో రూ.500 ప్లాన్
ఈ జియో రీఛార్జ్ ప్లాన్ ధర రూ .500. వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ మొత్తం 56 జీబీ డేటాను అందిస్తుంది. అంటే వినియోగదారులు రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటాను పొందుతారు. అదనంగా, ఈ ప్లాన్ లో అదనపు ఛార్జీ లేకుండా ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 100 SMSలు పంపుకోవచ్చు.ఈ ప్లాన్ లో అనేక ఓటీటీ యాప్స్ కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.
ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు ఇవే..
యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో హాట్ స్టార్ (టీవీ/మొబైల్), సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్ట్స్, కంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్, ఫ్యాన్ కోడ్, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్.. ఈ సబ్‌స్క్రిప్షన్‌లన్నీ ఈ ప్లాన్‌తో ఉచితంగా లభిస్తాయి.
ఈ ఓటీటీలు మాత్రమే కాకుండా ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది. జియో హోమ్ 2 నెలల ఉచిత ట్రయల్, జియో ఏఐ క్లౌడ్‌లో 50 జీబీ స్టోరేజ్ కూడా కొత్త కనెక్షన్లతో అందుబాటులో ఉన్నాయి. అదనంగా, ఈ ప్లాన్ లో 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా ఉంది.


































