నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న 35 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఫ్రంట్ ఆఫీస్ కో ఆర్టినేటర్, రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. పదో తరగతి, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రిక్రూట్‌మెంట్ చేస్తోంది. జనవరి 27వ తేదీ వరకు అప్లై చేయాలి. 11 జిల్లా కోర్టుల్లో 35 పోస్టులు ఉన్నాయి.
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు జిల్లాల వారీగా విడుదలైన జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు దొరుకుతుంది.
ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్‌లో అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేయాలి. ఓఎంఆర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. ఆఫ్‌లైన్ అప్లికేషన్ జనవరి 12వ తేదీన ప్రారంభమైంది. జనవరి 27వ తేదీ వరకు ఉంటుంది.
ఆఫీస్ కో-ఆర్డినేటర్ : కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ పరిజ్ఞానంతో ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత, ఎంఎస్ ఆఫీస్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
రికార్డు అసిస్టెంట్ : ఎస్ఎస్‌సీ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ : కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ పరిజ్ఞానంతో ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత, ఎంఎస్ ఆఫీస్‌లో కనీసం మూడేళ్ల అనుభువం ఉండాలి.
ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుకు జీతం స్కేల్ రూ.25,220 – రూ. 80,910 వరకు ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.23,120 – రూ.74,770, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు పే స్కేల్ రూ. 28,280 – రూ. 89,720 వరకు నెల జీతం ఉంటుంది.
ఆయా జిల్లాల లీగల్ సర్వీసెస్ అథారిటీ పేరుతో స్పీడ్ పోస్ట్ చేయాలి. పైన ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో రాయాలి. ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు రూ.500గా దరఖాస్తు ఫీజు నిర్ణయించారు. డీడీని ఏదైనా జాతీయ బ్యాంకు నుండి తీసుకొని, కార్యదర్శి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఆయా జిల్లా పేరుతో స్పీడ్ పోస్ట్‌లో చెల్లించాలి.
జిల్లాల వారీగా ఉన్న కోర్టుల అధికారిక వెబ్‌సైట్ వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్, నోటిఫికేషన్ సెక్షన్‌లలో ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు చూడవచ్చు. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
































