హైదరాబాద్ ఉప్పల్ లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR NGRI) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Group-C) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫార్మ్ సమర్పించడానికి చివరి తేదీ జనవరి 05.
పోస్టులు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 12. (ఆన్ రిజర్వ్డ్ 06, ఈడబ్ల్యూఎస్ 01, ఓబీసీ 04, ఎస్సీ 01)
ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి మెట్రిక్యు లేషన్ లేదా సమాన అర్హత, ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత సాధించడంతోపాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 25 ఏండ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 06.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ఎక్స్ సర్వీస్మీన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ. 500
లాస్ట్ డేట్ : జనవరి 05. సెలెక్షన్ ప్రాసెస్: షార్టిస్ట్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ngri.res.in వెబ్ సైట్ సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీ, తెలుగు మాధ్యమంలో ఉంటుంది. ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఇస్తారు. మొత్తం 150 ప్రశ్నలు 2 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు 75 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 75 మార్కులకు, జనరల్ అవేర్ నెస్ నుంచి 50 ప్రశ్నలు 150 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు ఇస్తారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాదానానికి 1 మార్క్ కోత విధిస్తారు.

































