అజ్ఞాతనంలో జానీ మాస్టర్‌.. కొనసాగుతున్న పోలీసుల వేట.. మూడ్రోజులుగా పరారీలో..

www.mannamweb.com


సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఇప్పటికే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబైలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.

ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. 2017లో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడని.. 2019లో అతడి టీంలో తనను అసిస్టెంట్ గా తీసుకున్నాడని.. కానీ ముంబైలో ఓ షూట్ కోసం జానీ మాస్టర్ తోపాటు తాను కూడా వెళ్లానని.. అదే సమయంలో తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని సదరు యువతి ఫిర్యాదులో వెల్లడించింది. అనేకసార్లు తనపై దాడి చేశాడని.. కొట్టడం.. తిట్టడం కూడా చేశాడని.. జానీ మాస్టర్ తోపాటు అతడి భార్య కూడా తనను తీవ్రంగా వేధించిందని తెలిపింది.

దీంతో జానీ మాస్టర్ పోక్స్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు.. ఆయన షూటింగ్ కోసం అవుట్‌డోర్‌ వెళ్లారనే సమాచారంతో అక్కడికి ప్రత్యేక టీమ్‌లను కూడా పంపారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలుమార్లు బాధితురాలని విచారించిన పోలీసులు… పలు సెక్షన్ల కింద నాన్‌-బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్‌ను ఎఫ్‌ఐఆర్‌లో యాడ్‌ చేశారు. ఇక జానీ మాస్టర్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. ఓసారి నెల్లూరులో ఉన్నారని ప్రచారం..మరోసారి ముంబైలో ఉన్నాడని పుకారు.. ఇప్పుడు లఢక్‌లో ఉన్నాడన్న సమాచారంతో బృందాలుగా విడిపోయి వెతికే పనిలో పడ్డారు పోలీసులు.

ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ కేసుపై ఎన్‌హెచ్ఆర్‌సీకి లేఖ రాసింది బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. బాధితురాలికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు లేవని, ఎన్‌హెచ్ఆర్‌సీ జోక్యం చేసుకోవాలని తెలిపింది. లైంగిక వేధింపులతో పాటు బలవంతపు మతమార్పిడి కేసులు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. బాధితురాలు కంప్లైంట్ ఇచ్చి ఆరు రోజులు గడిచిన నిందితుడిని అరెస్టు చేయలేదని.. మత మార్పిడి, లైంగిక వేధింపులపై సీరియస్ యాక్షన్ తీసుకునేలా తెలంగాణ పోలీసులను ఆదేశించాలని కోరింది బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి.