ప్రస్తుతం సమాజంలో చాలామంది ఒబేసిటీ తో బాధపడుతున్నారు. మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు వెరసి చాలామంది ఊబకాయ బాధితులుగా మారుతున్నారు. ఊబకాయ బాధితులుగా మారిన తర్వాత డయాబెటిస్, బీపీ వంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చినప్పుడు అప్పుడు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు.
జొన్న రొట్టె, రాగి రొట్టె లలో ఫుల్ పోషకాలు తృణధాన్యాల తో చేసిన ఆహారాన్ని, జొన్న రొట్టె, రాగి రొట్టె వంటి వాటిని తింటున్నారు. అయితే జొన్న రొట్టె, రాగి రొట్టె రెండు మంచివే అయినప్పటికీ బరువు తగ్గించడంలో ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకోవాలి. జొన్న రొట్టె, రాగి రొట్టెల లో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ మన బరువు తగ్గడానికి బాగా దోహదం చేస్తాయి.
కడుపు నిండిన భావన కలిగించే రొట్టెలు ఇవే జొన్న రొట్టె రాగి రొట్టె రెండింటిలోనూ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా సేపు మన కడుపు నిండినట్లు అనిపించేలా చేసి అనవసరమైన వాటిని తినకుండా మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఆరోగ్యంగా ఉండేలా చేయడమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవక్రియకు దోహదం చేస్తాయి. జొన్న రొట్టెలో పోషకాలు ఇలా జొన్న రొట్టె లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాదు జొన్న రొట్టెను తిన్నట్లయితే కడుపు నిండుగా ఉంటుంది. జొన్న రొట్టెలలో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల అధికంగా ఆహారం తీసుకోవడం జరగదు. ఇది మన బరువు తగ్గడానికి కీలకంగా దోహదం చేస్తుంది.
రాగి రొట్టెలలో పోషకాలు ఇలా రాగి రొట్టె విషయానికి వస్తే రాగి రొట్టెలలో ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఇవి మన బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రాగి రొట్టెలు తింటే మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాగులలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల మన ఎముకల ఆరోగ్యానికి కూడా దీనివల్ల మంచి జరుగుతుంది.
బరువు తగ్గాలంటే ఇదే బెస్ట్ అయితే జొన్న రొట్టె, రాగి రొట్టె విషయానికి వస్తే ఈ రెండు రొట్టెలలో బరువు తగ్గడానికి ఏది మంచిది అంటే జొన్న రొట్టెను ఉత్తమమైనదని చెబుతారు. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల రాగి రొట్టె కంటే జొన్న రొట్టె తిన్నవారు త్వరగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఇది ప్రభావవంతంగా బరువును తగ్గించడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు.
































