ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ అయిన నారా లోకేష్ పుట్టిన రోజు నేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి, 2024 ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారు.
ప్రజాసేవలో తనదైన మార్కు చూపిస్తూ తన నియోజకవర్గం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చాలా కష్టపడుతున్నారు.
లోకేష్ పుట్టినరోజు.. జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర ట్వీట్
లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే పార్టీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చాలాకాలంగా తెలుగుదేశం పార్టీ పైన, టిడిపిలో జరుగుతున్న అనేక పరిణామాల పైన ఏ విషయంలోనూ నోరు విప్పని జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పోస్ట్ చేశారు. నారా లోకేష్ మీకు ఈ ఏడాది మరొక అద్భుతమైన సంవత్సరం అవ్వాలని కోరుకుంటున్నానని, జన్మదిన శుభాకాంక్షలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.




































