జత్వాని కేసుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. చంద్రబాబు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనను అమలు చేస్తూ ఐఏఎస్, ఐపీఎస్‌లపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.
ముంబైనటి జత్వానిని అడ్డంపెట్టుకుని స్టోరీ అల్లారని విమర్శించారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. సినీనటిని సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి వేధించారన్నారు. తప్పు చేసినవారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు.
సినీనటి జత్వాని కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఏ-1 నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను డెహ్రాడూన్‌లో అరెస్ట్ చేశారు. ఆయనను విచారించి కోర్టులో హాజరుపర్చనున్నారు. జత్వానీ వ్యవహారంలో ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై అక్రమ కేసు పెట్టి వేధించారని ఈనెల 13న జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏ-1గా కుక్కల విద్యాసాగర్‌ను చేర్చారు. ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా , విశాల్ గున్నీలను నిందితులుగా చేర్చి సస్పెండ్ చేశారు.