మేరీ మాతగా మారిన కాళీ మాత విగ్రహం… పూజారి అరెస్ట్

హారాష్ట్రలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇది భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇందులో భాగంగా.. ముంబైలోని చెంబూరు లో గల కాళీ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని మేరీమాతను పోలినట్లుగా మార్చారని తెలుస్తోంది!


దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవ్వగా.. పోలీసులు ఆలయ పూజారీని అరెస్ట్ చేశారు.

అవును… జాతీయ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం ముంబైలోని కాళీ మాత విగ్రహాన్ని మేరీమాతను పోలి ఉండేలా మార్చారు! అనిక్ గ్రామంలోని హిందూ శ్మశాన వాటిక లోపల ఉన్న ఈ ఆలయంలో శనివారం ఈ సంఘటన జరిగింది. వెలుగులోకి వచ్చిన ఓ ఫోటోలో అమ్మవారి విగ్రహం బంగారు వస్త్రాలు ధరించి, తెల్లటి అలంకరణలతో ఉంటూ, తలపై పెద్ద కిరీటం అమర్చబడి ఉంది!

వాస్తవానికి సాంప్రదాయకంగా నలుపు లేదా ముదురు నీలం రంగు చర్మంతో ఉండే దేవత ముఖ తెల్లగా మార్చబడింది. ఈ సమయంలో విగ్రహం చేతిలో పిల్లల బొమ్మను పటుకుని ఉన్నట్లు చూపబడింది. ఇది శిశువు యేసును సూచిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు! అదేవిధంగా… మందిర నేపథ్యాన్ని శిలువ ఉన్న ఎర్రటి వస్త్రంగా మార్చారని చెబుతున్నారు.

ఈ సమయంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన భక్తులు.. ఏమి జరిగిందని ఆలయ పూజారిని అడిగినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. దీని సమాధానంగా… తనను తల్లి మేరీ రూపంలో అలంకరించమని దేవత కలలో కనిపించి చెప్పిందని ఆయన పేర్కొన్నారు! ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పూజారిని అదుపులోకి తీసుకుని, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

అరెస్ట్ అనంతరం ఆలయ పూజారిని కోర్టులో హాజరుపరిచి, రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఇది ఒంటరిగా చేసిన పనేనా.. లేక, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆ ప్రాంతంలో ఎలాంటి పుకార్లు వ్యాపించకుండా, ఎలాంటి ఘటనలు జరగకుండా, అశాంతిని నివారించడానికి కాళీ విగ్రహాన్ని దాని అసలు స్థితికి పునరుద్ధరించారు.

ఈ నేపథ్యంలో… విశ్వ హిందూ పరిషత్ (వీ.హెచ్.పీ), బజరంగ్ దళ్ వంటి సంఘాలు ఈ సంఘటనను ఖండించాయి. ఈ చర్య వెనుక ఉన్న వారందరినీ గుర్తించి విచారణ చేయాలని డిమాండ్ చేశాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.