రూ.500 కోట్ల క్లబ్‌లో ‘కాంతార చాఫ్టర్ 1’.. బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాఫ్టర్ 1 (Kantara: Chapter 1) చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.


కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును అందుకుంది. విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.509 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. మరోవైపు ఈ వీకెండ్ కూడా థియేటర్‌లలో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో కాంతార మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.