ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులందరికీ గుడ్‌న్యూస్

రిజిస్ట్రేషన్ల శాఖకు వీలైనంత త్వరగా కొత్త బిల్డింగుల నిర్మించి ఇస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఇవాళ(ఆదివారం) ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ల అసోసియేషన్, రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ ఉద్యోగుల సంఘం సంయుక్త సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్ పాల్గొని డైరీ ఆవిష్కరించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు రద్దు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉద్యోగులు కృతజ్ఞతలు తెపారు.


ప్రజలతో మమేకమై మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని ఉద్యోగులను మంత్రి అనగాని సత్య ప్రసాద్ కోరారు. ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తానని మంత్రి అనగాని సత్య ప్రసాద్ హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఆ పోస్టులను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయిస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ హామీ ఇచ్చారు.