Favorite Fruit : మీకు ఇష్టమైన పండును బట్టీ మీ వ్యక్తిత్వం చేప్పేయొచ్చు తెలుసా..?

ఇష్టమైన పండును: పండ్లు ఆరోగ్యానికి మంచివి. వీటిని రోజు తినడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే మనం మాత్రం కొన్ని పండ్లనే ఇష్టంగా తింటారు..మీరు ఇప్పటి వరకూ… పండ్లు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుని ఉంటారు..కానీ మీకు ఇష్టమైన పండ్లను బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పవచ్చు తెలుసా..?
క్రేజీగా ఉంది కదా.! మానసిక నిపుణులు కూడా వ్యక్తిత్వ లక్షణాలను డీకోడ్ చేయడానికి పండ్లను ఉపయోగిస్తారు. మీకు ఏ పండు ఇష్టమో మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు చూద్దామా..!


ఆపిల్
ఆపిల్ ఇష్టపడే వ్యక్తులు ఆచరణాత్మకంగా ఉంటారు. ఏ పనినైనా పద్ధతిగా చేస్తారు. దినచర్య, క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారు.

మామిడిపండు
పండ్లలో రారాజు మామిడిపండు. దీన్ని ఇష్టపడే వ్యక్తులు చాలా స్టైలిష్‌గా ఉంటారట. ఆకర్షణీయంగా కనిపిస్తారు. వీరిని నమ్మవచ్చు. ఆశావాదంతో ముందుకు వెళ్తారు. వీరు తమ జీవితంలో రాజులా బతకాలని అనుకుంటారు. సున్నితమైన అంశాలపై ఇష్టాన్ని చూపిస్తారు. తమ అర్హతకు తగ్గ వస్తువులనే కొంటారట.. తక్కువ స్థాయి వస్తువులను వాడడానికి ఇష్టపడరు.

అరటిపండు
ఈ పండు సీజన్‌తో సంబంధం లేకుండా విరివిగా దొరుకుతుంది. ఈ పండును ఇష్టపడేవారు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఏదీ మనసులో దాచుకోరు. అన్ని బయటకే భోళా శంకరుల్లా మాట్లాడుతారు. అంతేకాదు ఈ వ్యక్తులు సంబంధ బాంధవ్యాలకు విలువ ఇస్తారు. ఏ పని అయినా చాలా శ్రద్ధతో చేస్తారు.

పైనాపిల్
ఈ అనాసపండును ఇష్టపడే వ్యక్తులు ఉత్సాహంగా ఉంటారట…వారితో మాట్లాడితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సేదతీరినట్టు అనిపిస్తుంది. మీరు ఆశావాదంతో ముందుకెళ్తారు. జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. వారితో ఎవరు ఉన్నా కూడా వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఎదుటివారిని సంతోషంగా ఉంచడంలో వీరు నిపుణులు.

ఆరెంజ్
సిట్రస్ పండ్ల జాతికి చెందింది నారింజ. ఈ పండును ఇష్టపడే వ్యక్తులు సృజనాత్మకతను కలిగి ఉంటారు. చాలా కళాత్మకంగా పనులను చేస్తారు. సాహసోపేత నిర్ణయాలను, స్వభావాన్ని కలిగి ఉంటారు.

ఇవన్నీ మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు.. కానీ పండ్లను బట్టి వ్యక్తిత్వం చెప్పవచ్చని సైకాలజీలో కూడా ఉంది. ఇంతకీ మీకు ఇష్టమైన పండు ఏది..!