కొర్రల పులావ్.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..

www.mannamweb.com


ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడానికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోక పోవడమే. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంతో చాలా మంది హెల్దీ ఆహారం తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా మిల్లెట్స్ తీసుకుంటున్నారు. మిల్లెట్స్‌లో కొర్రలు కూడా ఒకటి. కొర్రలు ఎంతో పౌష్టికరమైన ఆహారం. వీటిని పిల్లలు, పెద్దలు ఇవ్వడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కొర్రలతో ఎక్కువగా చాలా మంది అన్నం, కిచిడీ చేస్తారు. అలా కాకుండా పులావ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. తక్కువ సమయంలోనే అయిపోతుంది. మరి ఈ కొర్రల పులావ్ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొర్రల పులావ్‌కు కావాల్సిన పదార్థాలు:

కొర్రలు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, పులావ్ దినుసులు, ఆయిల్.

కొర్రల పులావ్‌ తయారీ విధానం:

ముందుగా కొర్రలను శుభ్రంగా కడిగి గంట పాటు నీటిలో నానబెట్టాలి. ఈ పులావ్‌ని కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇప్పుడు చాలా కొద్దిగా పులావ్ దినుసులు, జీలకర్ర వేసుకోండి. ఇవి వేగా ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగాక.. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి వేయించాలి. ఆ నెక్ట్స్ మీరు తీసుకున్న కూరగాయలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ ఓ రెండు నిమిషాలు వేయించాక.. కొర్రలు వేసి ఓ సారి వేయించాలి.

ఇవి కూడా వేగిపోయాక కొత్తిమీర, సరిపడా నీళ్లు వేసి ఓ రెండు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయండి. ఆవిరి పోయాక ఒకసారి తీసి కొత్తిమీర మళ్లీ చల్లి.. అంతా ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే. ఈ పులావ్‌ని ఎలాంటి వెజ్ లేదా నాన్ వెజ్ కర్రీతో అయినా తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ పులావ్‌ని ఉదయం, మధ్యాహ్నం, డిన్నర్‌గా అయినా తీసుకోవచ్చు.