అంగారకుడిపై జీవం? ఈ ‘స్మైలీ ఫేస్‌’ చెబుతోన్నదేమిటి?

www.mannamweb.com


అంతరిక్షంలో ఏముంది? దీని కోసం మన శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనే రకాల గ్లోబల్‌ స్పేస్‌ ఏజెన్సీలు ఈ పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఓ కొత్త విషయాన్ని బహిర్గతం చేసింది. అంగారక(మార్స్‌) గ్రహంపై తీసిన ఓ ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటో మనం సోషల్‌ మీడియాలో వాడే స్మైలీ ఫేస్‌ ఆకారంలో కనిపిస్తోంది. అంగారకునిపై క్లోరైడ్‌ ఉప్పు నిల్వలే ఇలా స్మైలీ ఆకారంలో పేరుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో చాలా కాలంగా అంగారకుడిపై జీవం ఉందా లేదా అని శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలకు కీలక లీడ్‌ దొరికినట్లు అయ్యింది. కాగా ఫొటోలో కనిపిస్తున్న స్మైలీ ఫేస్‌ అందరిలో ఆసక్తిని కలుగజేస్తోంది.

భూమిని పోలిన గ్రహం ఇదే..

అంతరిక్షంలోని సౌర కుటుంబంలో భూమిని పోలినట్లు ఉండే గ్రహం అంగారకుడు. అంతేకాక భూమికి చాలా దగ్గరగా కూడా ఉంటుంది. దీనిపై జీవం ఆనవాళ్ల గురించి చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వారు కొనుగోన్నారు. ఆ గ్రహంపై అగ్ని పర్వతాలు ఉండేవని, సముద్రాలు కూడా ఉండేవని, అవి ఎండిపోయి సరస్సులుగా మారిపోయాయని గుర్తించారు. అయితే అవి అలా ఎందుకు మారిపోయాయి అన్న విషయంపై మాత్రం శాస్త్రవేత్తకు క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు స్మైలీ ఫేస్‌ షేప్‌లో ఉప్పు ఆనవాళ్లు కనిపించడంతో పరిశోధకులకు మళ్లీ ఉత్సాహం కలిగించింది. ఈ ఉప్పు నిక్షేపాలు సముద్రాలు ఉన్నాయి అని చెప్పేందుకు సంకేతాలు కావొచ్చని అంచనా వేస్తున్నారు.
సోషల్‌ మీడియా రియాక్షన్‌ ఇలా..

యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఈ స్మైలీ ఫేస్‌ ఫొటోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేసింది. దీనికి ‘ఎందుకంత సీరియస్‌గా ఉన్నారు? అంగారక గ్రహం ఒకప్పుడు నదులు, సరస్సులు సముద్రాలు ఉన్న ప్రపంచం. ఇప్పుడు అది తన రహస్యాలను మనతో పంచుకుంటోంది. మా ఎక్సోమార్స్‌ ట్రేస్‌ గ్యాస్‌ ఆర్బిటర్‌ వ్యోమనౌక ద్వారా అక్కడ ఉప్పు నిక్షేపాలలో కొన్ని ఆధారాలు కొనుగొన్నాం అనే పోస్ట్‌ చేసింది. అంతేకాక దీనిపై నెటిజనుల కామెంట్లను కూడా ఏజెన్సీ కోరింది. దీనిని చూసిన నెటిజెనులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘మార్స్‌ గ్రహం నవ్వుతున్నట్లు ఉంది’.. ‘అక్కడ నేరు ఉండేదని తెలుస్తోంది’.. ఈ గ్రహం అందంగా ఉంది అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.

జీవానికి అవకాశం ఉందా?

అంగారకుడిపై ప్రస్తుతం అధిక చలి, రేడియేషన్‌ ఉన్నాయని, నీళ్లు ఉన్న ఆనవాళ్లు కూడా ఏమి లేవని.. దీని దవఆరా అక్కడ జీవులు బతికే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ భూమి ఉన్న ఉన్న అత్యంత చల్లని ప్రదేశాలైన అంటార్కిటికా, అలాగే అత్యంత డ్రైగా ఉండే చిలీ దేశంలోని అటకామా ప్రదేశాల్లో కూడా కొన్ని రకాలు జీవులు బతుకుతున్న నేపథ్యంలో మార్స్‌ పై కూడా జీవులు ఉండే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కనిపించిన ఉప్పు నిక్షేపాలు, చాలా ఏళ్ల క్రితం అక్కడ నీరు ఉండేదని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో మరిన్ని పరిశోధనలకు శాస్త్రవేత్తలు సమాయత్తమవుతున్నారు.