బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ ఉండే ఫోన్ ల కోసం చూస్తున్నారా?

ఈ రోజుల్లో ఫోన్ వాడకం చాలా పెరిగిపోయింది. ప్రజలు ప్రతి చిన్న, పెద్ద పనికి స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. అటువంటి పరిస్థితిలో, ఫోన్ బ్యాటరీ కూడా త్వరగా అయిపోతుంది. ఈ కారణంగా, ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడానికి పెద్ద బ్యాటరీని కలిగి ఉండటం కూడా ముఖ్యం. ఈ రోజుల్లో, మంచి బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లు బడ్జెట్ ధరలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్ కొనాలనుకుంటున్నారా? కాబట్టి ఇక్కడ మేము రూ. 15 వేల లోపు ఉత్తమ మోడళ్ల గురించి మీకు చెప్పబోతున్నాము. మరి అవేంటంటే?


శామ్‌సంగ్ గెలాక్సీ M35 5G
కస్టమర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.13,448కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని అందిస్తుంది ఈ ఫోన్. అంతేకాదు దీనితో పాటు 50MP ప్రైమరీ రియర్ కెమెరా లభిస్తుంది. 6.6-అంగుళాల sAMOLED డిస్ప్లే ఉంటుంది. అంతేకాదు వేపర్ కూలింగ్ చాంబర్ వంటి ఫీచర్లతో వస్తుంది.

వివో T4x 5G
ఈ స్మార్ట్‌ఫోన్‌ కూడా మంచి ఫీచర్లను అందిస్తుంది. ఇక ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో మీకు సరసమైన ధరకే అందుబాటులో ఉంది. కేవలం రూ.13,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీ, 50MP + 2MP వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6.72-అంగుళాల డిస్ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది.

మోటరోలా G64 5G
కస్టమర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.13,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, 50MP (OIS) + 8MP వెనుక కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 6.5-అంగుళాల పూర్తి HD+ డిస్ప్లే వంటి లక్షణాలతో వస్తుంది.

రియల్మీ నార్జో 80x 5G
కస్టమర్లు ప్రస్తుతం ఈ ఫోన్‌ను కంపెనీ సైట్ నుంచి రూ.12,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కూడా 6000mAh బ్యాటరీ ని అందిస్తుంది. ఏకంగా IP69 వాటర్‌ప్రూఫ్ రేటింగ్ తో వస్తుంది ఈ ఫోన్. డైమెన్సిటీ 6400 5G ప్రాసెసర్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 120Hz ఐ కంఫర్ట్ డిస్‌ప్లేతో వస్తుంది.

రెడ్‌మి 10 పవర్
ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ సైట్ నుంచి ప్రస్తుతం రూ.12,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లలో 6000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 50MP ప్రైమరీ కెమెరా, 6.71-అంగుళాల డిస్ప్లే, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.