LPG Gas Subsidy: మీకు గ్యాస్ సబ్సిడీ వస్తుందో లేదో తెలియడం లేదా, ఇలా చెక్ చేసుకోండి

Share Social Media

LPG Gas Subsidy: మీ మొబైల్ నెంబర్ ఒకవేళ మీ బ్యాంకు ఎక్కౌంట్‌కు లింక్ కాకుండా ఉంటే మీకు గ్యాస్ సబ్సిడీ ప్రతి సిలెండర్‌కు 237 రూపాయలు వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉంటుంది.
అందుకే మొబైల్ నెంబర్ ద్వారా సులభంగా గ్యాస్ సబ్సిడీ గురించి తెలుసుకునే పద్ధతులు తెలుసుకుందాం.

ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్దిదారులైతే మాత్రం ప్రతి సిలెండర్‌పై సబ్సిడి 237 రూపాయలు అందుతుంటుంది. ప్రతి లబ్దిదారుడు తమకు సబ్సిడీ అందుతుందో లేదో తెలుసుకునేందుకు ఓ వెబ్‌సైట్ కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్ నుంచి మొబైల్ నెంబర్ ఆధారంగా సబ్సిడీ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా గ్యాస్ సబ్సిడీ రావడం లేదని తేలితే వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీకు వెళ్లి సరిచేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలో పరిశీలిద్దాం.

ముందుగా అధికారిక వెబ్‌సైట్ mylpg.in ఓపెన్ చేయాలి. దీనిపై క్లిస్ చేసినా ఓపెన్ అవుతుంది. లింగ్ ఓపెన్ కాగానే అన్ని గ్యాస్ కంపెనీలు కన్పిస్తాయి. అందులో ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ ఆన్‌లైన్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్, ఇండేన్ గ్యాస్ ఆప్షన్లు ఉంటాయి. లాగ్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ కొత్తగా ఓపెన్ చేస్తుంటే మాత్రం ఆధార్ కార్డు నెంబర్‌తో క్యాప్చా, ఎక్కౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్, ఎల్పీజీ గ్యాస్ ఐడీ , గ్యాస్ కనెక్ఠన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే మీ గ్యాస్ సబ్సిడీ స్క్రీన్‌పై కన్పిస్తుంది.

Related News

మీ మొబైల్ నుంచి కూడా గ్యాస్ సబ్సిడీ వస్తుందో లేదో చెక్ చేసుకునేందుకు వీలుంది. దీనికోసం అధికారిక వెబ్‌సైట్ pmfs.nic.in. ఓపెన్ చేయాలి. మీ పేమెంట్స్ సంబంధించిన ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత మీ బ్యాంక్ ఎక్కౌంట్‌కు ఎంత డబ్బులు జమ అయ్యాయో ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తుంది.

Related News