సినీ ప్రియుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు.. సంక్రాంతికి ఊహించని సర్‌ప్రైజ్

టాలీవుడ్ స్టార్ హీరోలంతా వరుస సినిమాల్లో నటిస్తూనే బిజినెస్‌లోనూ రాణిస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు థియేటర్స్ నడిపిస్తూ సినీ ప్రియులకు కావాల్సిన వాటిని అందిస్తూ సౌకర్యవంతంగా సినిమా చూసేలా నిర్మిస్తున్నారు.


ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం AMB సినిమాస్‌ను తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్‌ను ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. అది కూడా అందరికీ ఎంతో ఇష్టమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇది నిర్మించబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఇక్కడ సంధ్య, సుదర్శన్ వంటి ఫేమస్ థియేటర్లు ఉండగా.. ఇప్పుడు మరొక మల్టీఫ్లెక్స్ కూడా తోడవుతుంది. ఇక హైదరాబాద్ నగరం మొత్తంలో ఎన్ని థియేటర్స్‌ ఉన్నప్పటికీ ఎంతోమంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్దనే తమ అభిమాన హీరోల సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం అక్కడికే వచ్చి అభిమానులతో ముచ్చటిస్తారు. అయితే అక్కడ థియేటర్స్‌లో సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ ఇబ్బందులు పడి మరీ అక్కడే చాలామంది భారీ చిత్రాలను చూస్తారు. అందుకే మహేష్ బాబు సినీ ప్రియులందరికీ సినిమాటిక్ అనుభూతిని పెంపొందించే విధంగా ఈ మల్టీఫ్లెక్స్ 7విలాసవంతమైన స్క్రీన్స్‌తో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానుల కోసం సౌకర్యాలు మరింతగా పెంచుతూ.. ప్రతి సీటింగ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించున్నారట. అట్మోస్ సౌండ్ సిస్టమ్, 4K లేజర్ ప్రొడక్షన్ స్క్రీన్‌లతో సినిమాను థ్రిల్లింగ్‌ అనుభవంగా మార్చే విధంగా రూపొందిచనున్నారు. ఈ మల్టిఫ్లెక్స్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అవి చూసిన నెటిజన్లు సంతోషపడుతున్నారు. కాగా.. ప్రస్తుతం మహేష్ బాబు ఓ భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ‘SSMB29’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సూపర్ స్టార్‌తో రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి పలు పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.