మహేశ్ బాబు సంచలన నిర్ణయం.. కొడుకు, కూతురును కూడా

సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇక ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎస్ఎస్ఎంబి 29 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. కేల్ నారాయణ ఏకంగా 1000 కోట్ల వరకు బడ్జెట్ను వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన జక్కన్న ఇప్పుడు బిగ్ ప్రాజెక్టును డీల్ చేస్తున్నారు.

ఎస్ఎస్ఎంబి 29 తో వరల్డ్ మార్కెట్ ను కొల్లగొట్టాలని దర్శక ధీరుడు రాజమౌళి భావిస్తున్నారు. ఆ టార్గెట్ కు అనుగుణంగానే ఎస్ఎస్ఎంబి 29 చిత్రాన్ని రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అందించని జక్కన్న శరవేగంగా సినిమా షూటింగ్ పార్ట్ ను మాత్రం కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హైదరాబాదులో మొదటి షెడ్యూల్ ముగిసి, ఒడిశాలో రెండో షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసుకుంది ఎస్ఎస్ఎంబి 29 యూనిట్. ఇక మూడో షెడ్యూల్ కు తిరిగి హైదరాబాద్ కు వచ్చారు.

ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ చిత్రంపై ఇటు ప్రేక్షకుల్లో, అటు మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా గా ఎస్ఎస్ఎంబి 29 గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. ఎస్ఎస్ఎంబి 29 తోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని, కూతురు సితార ఘట్టమనేనిని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నారంట. ఇక ఈ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఉంటుంది కాబట్టి తన కొడుకు, కూతుర్ని కూడా కీలకపాత్రలో నటింపజేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై జక్కన్న ఎలా స్పందించారనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు గౌతమ్ ఘట్టమనేని న్యూయార్క్ లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆంగ్ల నాటకాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. దాంతో గౌతమ్ డెబ్యూ ఫిల్మ్ ఎప్పుడు ఉంటుందా అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతం 1 నేనొక్కడినే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక హీరోగా పరిచయం అవడమే మిగిలి ఉంది. అటు మహేష్ బాబు కూతురు సితార కూడా భారీ యాడ్ ఫిలిమ్స్ లో నటిస్తూ సందడి చేస్తోంది. ఇక వీరిద్దరూ ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్టులో ఉంటారా లేదా అనేది వేచి చూడాలి.