హోటల్ స్టైల్ లో “గుంతపొంగనాలు” ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి..

హోటల్ స్టైల్ లో ‘గుంతపొంగనాలు’ ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి.. ఉదయం టిఫిన్‌లో దోసెలు తరచూ తయారు చేస్తాం. అదే దోసె పిండితో గుంత పొంగనాలను కూడా చేస్తారు, ఇవి చాలా రుచిగా ఉంటాయి.


సాధారణ గుంత పొంగనాల కంటే కింది విధానంలో తయారు చేసినవి మరింత రుచికరంగా ఉంటాయి. రుచికరమైన గుంత పొంగనాల తయారీ విధానం మరియు దానికి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుంత పొంగనాల తయారీకి కావాల్సిన పదార్థాలు:
దోసె పిండి – 1 కప్పు
చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4
క్యారెట్ తురుము – ¼ కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 1 టేబుల్ స్పూన్
తరిగిన కొత్తిమీర – కొద్దిగా

గుంత పొంగనాల తయారీ విధానం:
ముందుగా దోసె పిండిలో ఉప్పు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి.గుంత పొంగనాల పాత్రలోని ప్రతి గుంతలో కొద్దిగా నూనె వేయాలి.నూనె వేడి అయిన తర్వాత, కలిపిన పిండిని గుంతలలో వేసి మూత పెట్టాలి.5 నిమిషాల తర్వాత మూత తీసి, పొంగనాలను మరోవైపుకు తిప్పి మరో 2 నిమిషాలు ఉంచాలి.పొంగనాలు రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఈ విధంగా చేస్తే రుచికరమైన గుంత పొంగనాలు సిద్ధమవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీ లేదా మజ్జిగ చారుతో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటాయి. ఉదయం టిఫిన్‌గా లేదా సాయంత్రం స్నాక్స్‌గా ఈ పొంగనాలను తినవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.