మారుతీ సుజుకీ ఇన్‌విక్టోకు భారత్ ఎన్‌క్యాప్‌ 5 స్టార్ రేటింగ్‌

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రీమియం స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ యుటిలిటీ కారు ఇన్‌విక్టో.. భారత్‌ ఎన్‌క్యాప్‌లో (Bharat NCAP)లో 5 స్టార్ రేటింగ్‌ సాధించింది. ఈ మేరకు కంపెనీ ఓప్రకటన విడుదల చేసింది. దీంతో డిజైర్‌, విక్టోరిస్‌ తర్వాత భారత్‌ ఎన్‌క్యాప్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించిన మారుతీ సుజుకీ కార్లలో ఇన్‌విక్టో కూడా చేరింది.


మారుతీ సుజుకీ తమ ఉత్పత్తుల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని సంస్థ ఎండీ, సీఈవో హిసాషీ టకేయుచి తెలిపారు. భారత్ ఎన్‌క్యాప్‌ దేశీయంగా ప్రపంచస్థాయి టెస్టింగ్‌ ప్రొటోకాళ్లను తీసుకొచ్చిందన్నారు. దీంతో కస్టమర్లు మరింత అవగాహనతో వాహనాలను ఎంచుకునేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ 15 మోడళ్లలో 157 వేరియంట్లకు స్టాండర్డ్ ఫీచర్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే నెక్సా సేఫ్టీ షీల్డ్‌, అరెనా సేఫ్టీ షీల్డ్‌లు తమ వాహనాల్లో అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తున్నాయన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.