GST కోతతో Maruti Wagon R రేటు ₹60,000 కు పైగా తగ్గింది! – తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధర ఎంతంటే?

 ఈ పండుగల సమయంలో కొత్త కారు కొనేవాళ్లకు, కేంద్ర ప్రభుత్వం, GST తగ్గింపుతో (GST reduction on cars) గుడ్‌ న్యూస్‌ చెప్పింది.


ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, చిన్న కార్లపై జీఎస్టీ శాతాన్ని 28% నుంచి 18%కి తగ్గించారు. ఈ ప్రకారం, చిన్న కార్ల ధరలు దిగి వస్తాయి. చిన్న కార్ల విభాగంలో అత్యధికంగా అమ్ముడయ్యే మారుతి వాగన్ R కూడా ఇప్పుడు చాలా చౌకగా మారుతుంది. GST తగ్గింపు నియమం సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తుంది.

వాగన్ R రేటు ఎంత తగ్గవచ్చు?
ప్రస్తుత ఉన్న వాగన్ R ధరపై GST తగ్గింపు వల్ల కస్టమర్‌కు రూ. 60 వేల నుంచి రూ. 67 వేల వరకు డైరెక్ట్‌గా లాభం కలుగుతుంది. ఈ విషయాన్ని మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి. భార్గవ స్వయంగా చెప్పారు. వ్యాగన్ ఆర్ ధరను రూ. 60,000 నుంచి రూ. 67,000 వరకు తగ్గించవచ్చని వెల్లడించారు. ఇది సుమారు 8.5% నుంచి 9% వరకు తగ్గింపుగా భావించవచ్చు. ఉదాహరణకు, ఒక వేరియంట్‌ ధర ఎక్స్‌-షోరూమ్‌ రూ. 6 లక్షలు ఉంటే, ఇప్పుడు దాని రేటు రూ. 5.33 నుంచి రూ. 5.40 లక్షల వరకు చౌక అవుతుంది.

వాగన్ R ప్రస్తుత ధరలు

మారుతి వాగన్ R ప్రస్తుతం చాలా వేరియంట్లలో లభిస్తుంది. హైదరాబాద్‌ & విజయవాడలో, ప్రస్తుతం, ఎక్స్‌-షోరూమ్‌ ధరలు రూ. 5.79 లక్షల నుంచి రూ. 7.62 లక్షల మధ్య ఉన్నాయి.

జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ ధరలు సుమారుగా రూ. 4.95 లక్షల నుంచి రూ. 6.80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

చిన్న కార్లలో, మారుతి బ్రాండ్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఆల్టో ధర కూడా రూ. 40,000 నుంచి రూ. 50,000 వరకు తగ్గుతుందని భావిస్తున్నారు.

కస్టమర్‌కు లాభం ఏమిటి?
ఈ తగ్గింపు వల్ల, కస్టమర్లు, అవే పాపులర్‌ కార్లను ఇప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు & చాలా డబ్బు మిగిల్చుకోవచ్చు. అంతేకాదు, కార్‌ లోన్‌పై కొనేవాళ్లకు EMI భారం కూడా తగ్గుతుంది. ఒక సాధారణ లోన్‌ పద్ధతిలో నెలవారీ EMI రూ. 1,200 నుంచి రూ. 1,500 వరకు తగ్గే అవకాశం ఉంది.

ఎందుకు వాగన్ R ప్రత్యేకం?
చిన్న కార్ల సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా వాగన్ R కొనసాగుతోంది. ఇంధన సమర్థత, తక్కువ నిర్వహణ వ్యయంతో వాగన్ R ఫ్యామిలీ కార్‌గా ఎప్పటి నుంచో పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కొత్త ధరలతో మరింత అందుబాటులోకి వస్తుంది. హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌గా సిటీ డ్రైవింగ్‌కు ఇది పర్ఫెక్ట్‌ ఆప్షన్‌. బూట్‌ స్పేస్‌ కూడా తగినంత ఉండటంతో, ఫ్యామిలీ యూజ్‌కు చాలా బావుంటుంది. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపుతో బడ్జెట్‌-ఫ్రెండ్లీగా మరింత ఆకర్షణీయంగా మారింది.

మారుతి వాగన్ R పై జీఎస్టీ తగ్గింపు కస్టమర్లకు నేరుగా ఉపయోగపడుతుంది. రూ. 67,000 వరకు తగ్గిన ధర వల్ల, కొత్తగా కారు కొనాలనుకునే ఫ్యామిలీలకు ఇది మంచి అవకాశం. హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో కొత్త ధరలు ఇప్పటికే కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, కంపెనీల అమ్మకాలను కూడా పెంచుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.