మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఒక విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. చిరంజీవికి సర్జరీ జరిగిందని, అందుకే మన శంకరవర ప్రసాద్ గారు ప్రమోషన్లకు దూరంగా ఉన్నారని ఆ వార్తల సారాంశం.
ఈ రూమర్లతో మెగాభిమానులను తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా ఈ సర్జరీ వార్తలపై చిరంజీవి కూతురు సుస్మిత క్లారిటీ ఇచ్చింది. చిరంజీవి లేటెస్ట్ ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం (జనవరి 6) చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘చిరంజీవి కి సర్జరీ జరిగిందట నిజమేనా?’ అని ఓ విలేకరి అడగ్గా .. ‘దీనిపై ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయను’ అని చెప్పుకొచ్చింది. అలాగే ‘సర్జరీ కారణంగానే చిరంజీవి ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నారట కదా?’ అన్న ప్రశ్నకు ‘అలాంటిదేమి లేదని.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారని క్లారిటీ ఇచ్చింది. బుధవారం జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్‌తో పాటు, ప్రమోషన్స్, ఇంటర్వ్యూలకు చిరంజీవి, వెంకటేశ్ ఇద్దరూ హాజరవుతారని స్పష్టం చేసింది.
‘చిరంజీవి గారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు. ఓవర్సీస్ అభిమానులతో వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వస్తారు. గతంతో పోలిస్తే ఆయన ఫిట్‌నెస్ పై బాగా దృష్టి సారించారు. అందుకే స్క్రీన్‌పై స్పెషల్ లుక్‌లో కనిపిస్తున్నారు. షూటింగ్ ఉంటే ఆ మూడ్‌లోనే ఉంటారు. ఆయనలో కొత్త ఉత్సాహాన్ని ఈ లో చూస్తారు’ అని సుస్మిత పేర్కొంది. ఇక మరో నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ..చిరంజీవి ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారని, అవుట్‌డోర్ షూటింగ్ జరిగే సమయంలోనూ రెండు పూటల జిమ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
కాగా బుధవారం జరిగే మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిరంజీవి, వెంకటేష్ తో పాటు చిత్రబృందమంతా ఈ మెగా ఈవెంట్ కు హాజరుకానున్నారని తెలుస్తోంది.

































