మినప్పిండి స్వీట్.. ఎంతో బలం.. తయారీ ఇలా..

స్వీట్లను చాలా మంది ఇష్టంగా తింటారు. మినప్పిండితో తయారు చేసిన స్వీట్లు టేస్టీ టేస్టీగాఉండే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు.


అంతేకాదు ఇవి చాలా బలం కూడా.. పూర్వ కాలంలో వాడు రాళ్లను పిండి చేస్తాడు అనే సామెతను వాడేవారు.. అంటే ఆ వ్యక్తికి చాలా బలం ఉందని అర్దం.. మరి మినప్పిండి స్వీట్​ తింటే అంత బలం వస్తుందట. మినప్పిండితో మీరే ఇంట్లో స్వీట్ షాప్ టేస్ట్ వచ్చేలా సింపుల్​గా రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ స్వీట్ టేస్ట్ చేశారంటే ఇంటిల్లిపాదీ మరొకటి కావాలంటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

మినప్పిండితో స్వీట్​ తయారీకి కావలసినవి

  • పొట్టు మినపప్పు :2 కప్పులు
  • పాలు : పావు కప్పు
  • నెయ్యి : 1 1/2 కప్పు
  • ఎడిబుల్ గమ్(జిగురు) : 1 టేబుల్ స్పూన్
  • కోవా : 250 గ్రాములు
  • మిక్ నట్స్ : 1 కప్పు (ఆల్మండ్స్, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పిస్తా)
  • చక్కెర : ఒకటిన్నర కప్పు
  • నీళ్లు : 1 కప్పు
  • యాలకుల పొడి : ఒకటిన్నర టేబుల్ స్పూన్
  • లవంగాల పొడి : ఒకటిన్నర టేబుల్ స్పూన్
  • శొంఠి పొడి : 3 టేబుల్ స్పూన్లు
  • దాల్చిన చెక్క పొడి : అర టీస్పూన్
  • జాపత్రి : కొంచెం
  • కుంకుమ పువ్వు : కొంచెం
  • మిరియాలు : 1 టీ స్పూన్

తయారీ విధానం: మినపప్పును వేగించి పొడి చేయాలి. తర్వాత ఒక గిన్నెలో మినపప్పు పొడి, పాలు, కప్పు నెయ్యి వేసి బాగా కలపాలి. అడుగు మందం ఉన్న పాన్​ లో మిగిలిన నెయ్యి వేడి చేసి ముందు వరకు వేగించాలి. అందులోనే ఎడిబుల్ గమ్, కలుపుకున్న మినప్పిండిని బంగారు రంగు వచ్చే కోవా వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసి పాన్ దించేయాలి. తర్వాత చక్కెర పాకం తయారు చేసుకుని మినప్పిండి, కోవా మిశ్రమం, యాలకుల పొడి, లవంగాల పొడి, శొంఠి పొడి, మిక్సిడ్​ నట్స్, దాల్చిన చెక్క, జాపత్రి, కుంకుమ పువ్వు, మిరియాలు కూడా వేసి బాగా కలిపి నచ్చిన షేపులో స్వీటు తయారు చేసుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.